Mana Shankara Varaprasad Garu OTT: మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీ డీటైల్స్.. చిరు మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mana Shankara Varaprasad Garu OTT: 2026 సంక్రాంతి బరిలో మోస్ట్ అవైటెండ్ మూవీగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu). సక్సెస్ పుల్ అండ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి- మెగాస్టార్ చిరంజీవి కాంబో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొనగా, అవి నిజమయ్యేలా ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా ఓటీటీ డీల్, ఓటీటీ స్ట్రీమింగ్ హాట్ టాపిక్ గా మారింది.

మన శంకర వర ప్రసాద్ గారు సినిమాను మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల తో పాటు ప్రముఖ నిర్మాత సాహు గారపాటి కలిసి షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార , క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటించగా, విక్టరీ హీరో వెంకటేష్ (Venkatesh) స్పెషల్ అప్పీయరెన్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది.సాంకేతికంగా చూస్తే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, బీమ్స్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా మారాయి.

Mana Shankara Vara Prasad Garu Locks OTT Deal Chiranjeevi Film Expected Streaming Date Revealed

బిజినెస్ పరంగా చూస్తే, మన శంకర వరప్రసాద్ గారు తెలుగు రాష్ట్రాల్లోనే భారీ స్థాయిలో థియేట్రికల్ డీల్స్ కుదుర్చుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో థియేట్రికల్ హక్కులు సుమారు 55 కోట్ల రూపాయలకు, నైజాంలో 32 కోట్ల రూపాయలకు, సీడెడ్ ఏరియాలో 18 కోట్ల రూపాయల మేరకు ట్రేడ్ అయ్యాయి. ఈ లెక్కన ఏపీ- తెలంగాణ కలిపి తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 105 కోట్ల రూపాయల బిజినెస్ నమోదు అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కర్ణాటకలో సుమారు 10 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయల మేరకు డీల్స్ కుదరడంతో, ఇండియా మొత్తంగా ఈ సినిమాకు దాదాపు 120 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమాకు మంచి డిమాండ్ కనిపించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా థియేట్రికల్ హక్కులు సుమారు 20 కోట్ల రూపాయల మేరకు అమ్ముడవ్వడం విశేషం. దీనితో వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల రూపాయల మధ్య జరిగినట్లు బిజినెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ స్థాయిలో బిజినెస్ జరగడం అంటే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గ్లోబల్ క్రేజ్, అలాగే అనిల్ రావిపూడి మార్కెట్ పవర్‌ను స్పష్టంగా చూపిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారీ బిజినెస్ నేపథ్యంలో, ఈ సినిమా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ.250 నుంచి రూ.280 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ అంచనా. అయితే సంక్రాంతి సీజన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్యాగ్, చిరంజీవి వింటేజ్ కామెడీతో పాటు వెంకటేష్ క్యామియో వంటి అంశాలు కలిసివస్తే ఈ టార్గెట్ సాధ్యం అవుతుందనే నమ్మకం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే, మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్‌కు ముందే బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్, ఓవర్సీస్ ట్రేడ్ పరంగా భారీ హైప్ క్రియేట్ చేసి, 2026 సంక్రాంతి బాక్సాఫీస్ రేస్‌లో స్ట్రాంగ్ కంటెండర్‌గా నిలిచింది.

ఈ నేపథ్యం మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఓటీటీ డీల్ చర్చనీయంగా మారాయి. ఈ మూవీ డిజిటల్ హక్కుల విషయంలోనూ ఈ సినిమాకు మంచి డిమాండ్ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ 5 (Zee5) సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులు జీ సినిమాలు (Zee Cinemalu) దక్కించుకున్నట్లు ట్రేడ్ టాక్. సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిన నాలుగు వారాల తర్వాత డిజిటల్ ప్రీమియర్ ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఫిబ్రవరి మొదటి వారం చివరిలో గానీ, మూడో వారం చివరిలో గానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. అధికారిక ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

మొత్తంగా చూస్తే, ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మన శంకర వరప్రసాద్ గారు థియేటర్లలో మంచి రన్ కొనసాగిస్తుండగా, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి వింటేజ్ కామెడీ, అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్, వెంకటేష్ క్యామియో కలిసి ఈ సినిమాను పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X