MSVPG OTT: మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ డేట్ లాక్.. చిరంజీవి మూవీని ఎక్కడ చూడాలంటే?

హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార, విక్టరీ వెంకటేష్ నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కేథరిన్ థ్రెసా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌, శరత్ సక్సేనా, సచిన్ ఖేడేకర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రోజే సూపర్‌‌హిట్ టాక్ తెచ్చుకున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో చిరంజీవి కెరీర్‌లోనే తొలిసారిగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది. తాజాగా ఈ మెగా బ్లాక్ బస్టర్ బొమ్మ ఓటీటీలో రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఏ ఓటీటీలో రానుంది? ఎప్పుడు విడుదల కానుంది? ఈ వివరాల్లోకి వెళితే..

Mana Shankara Vara Prasad Garu OTT Release Date Chiranjeevi s Blockbuster to Stream on ZEE5

మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత?
సాంకేతిక నిపుణులు, నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రోడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ కార్యక్రమాలతో కలిపి మన శంకర వరప్రసాద్ గారు మూవీని దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌తో కలిపి వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. దాంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్
మన శంకర వరప్రసాద్ గారు మూవీకి ఇప్పటి వరకు ఇండియాలో 201.74 కోట్ల రూపాయల నెట్... 237.85 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 43 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 283 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. అయితే చిరంజీవి మూవీకి ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల్లో 358 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా చిత్ర నిర్మాతలు తెలిపారు. దాంతో ఇప్పటి వరకు ఈ సినిమా 375 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. త్వరలోనే మన శంకర వరప్రసాద్ గారు మూవీ 400 కోట్ల రూపాయల మార్క్ చేరుకుంటుందని అంచనా.

మన శంకర వరప్రసాద్ గారు లాభాల పంట
ఇప్పటి వరకు కర్ణాటకలో 21.3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 209.45 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.91 కోట్ల రూపాయలు, కేరళలలో 12 లక్షల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 4.07 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించినట్లుగా సాక్‌నిక్ తెలిపింది. నిర్మాతలు అధికారిక ప్రకటన ప్రకారం ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ఈవెన్ టార్గెట్‌ను ఛేదించి లాభాల బాట పట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం దాదాపు 60 కోట్లకు పైగా లాభాలతో మన శంకర వరప్రసాద్ గారు మూవీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు నిజమైన సంక్రాంతి తెచ్చింది.

మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ
మన శంకర వరప్రసాద్ గారు మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌‌ను జీ గ్రూప్ 50 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. థియేటర్‌లో రిలీజైన 4 వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురావాలనే ఒప్పందం మీద డీల్ కుదిరింది. దీని ప్రకారం ఫిబ్రవరి 11న మన శంకర వరప్రసాద్ గారు మూవీ జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ ‌కు రానుంది. థియేటర్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పిన చిరంజీవి... ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X