మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రైట్స్ .. మెగాస్టార్ చిరంజీవి మూవీ ఎందులో అంటే?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ టేకప్ చేస్తున్న మూవీ కావడంతో పాటు చిరు హీరో కావడంతో ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు అనిల్. రిలీజ్‌కు గట్టిగా రెండు నెలలు కూడా లేకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
చిరంజీవి కెరీర్‌లో 157వ సినిమా
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. మన శంకర వరప్రసాద్‌గారు మూవీలో చిరంజీవి సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. మన శంకర వరప్రసాద్‌గారు చిత్రం మెగాస్టార్ కెరీర్‌లో 157వ చిత్రం కావడం విశేషం.

షూటింగ్ పరుగులు
మన శంకర వరప్రసాద్‌గారు మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మే 23న ప్రారంభమైంది. ఇక ప్రమోషనల్ కార్యక్రమాలకు పెట్టింది పేరైన అనిల్ రావిపూడి.. ఈ మన శంకర వరప్రసాద్‌గారు చిత్రం కోసం కూడా తన మార్క్ స్ట్రాటజీలు వాడుతున్నారు. దీనిలో భాగంగా ఈ చిత్రం నుంచి మీసాల పిల్ల అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించగా లెజెండరీ సింగ్ ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్‌లు ఈ పాటను ఆలపించారు.
మీసాల పిల్ల సాంగ్‌కి రికార్డ్ వ్యూస్
భీమ్స్ సంగీతానికి తోడు చిరంజీవి స్టెప్స్, నయనతార గ్లామర్ ఈ పాటను టాప్ ట్రెండింగ్‌లో ఉంచాయి. కొన్నిరోజుల పాటు ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటి వరకు ఈ సాంగ్‌ను ఏకంగా 71 మిలియన్ల మంది వీక్షించారు. టీ సిరీస్ యూట్యూబ్ ఛానెల్‌లో మీసాల పిల్ల సాంగ్ అందుబాటులో ఉంది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న విక్టరీ వెంకటేష్ .. ఇటీవలే చిత్ర యూనిట్‌తో కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి, వెంకటేష్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
మన శంకర వరప్రసాద్‌గారు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ఇక మన శంకర వరప్రసాద్‌గారు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రాలో 70 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయలు, నైజాంలో 40 కోట్ల చొప్పున ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 135 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. తమిళనాడు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్‌తో కలిపి ఈ సినిమా మొత్తం థియేట్రికల్ బిజినెస్ 160 కోట్లపైనే చేస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
మన శంకర వరప్రసాద్‌గారు ఓటీటీ రైట్స్ ఎవరికి?
ఇక మెగాస్టార్ మూవీ డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కోసం ఆయా కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది. తొలుత ఈ సినిమా ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. మన శంకర వరప్రసాద్‌గారు మూవీ ఓటీటీ రైట్స్‌ను జీ 5, శాటిలైట్ రైట్స్‌ను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ డీల్ ఎంత? నిజంగానే జీ గ్రూప్ ఈ హక్కుల్ని సొంతం చేసుకుందా? లేదా అన్న దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











