OTTలోకి మంచు లక్ష్మి రొమాంటిక్ సోషియో ఫాంటసీ హార్రర్ సిరీస్.. వెన్నులో వణుకుపుట్టించే దీన్ని ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా ఎక్కువ అవుతుడంగా.. ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా అద్భుతమైన కంటెంట్ ఇచ్చేందుకు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు. అనేక ఓటీటీ సంస్థలు ఒరిజినల్ కంటెంట్ కు పెద్ద పీట వేస్తూ.. అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ వంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ.. సూపర్ హిట్లు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో ఇలాంటి అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉండగా.. తాజాగా మరో క్రేజీ రొమాంటిక్ సోషియో ఫాంటసీ హార్రర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి ఎప్పటి నుంచి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా బాహుబలి లాంటి చారిత్రాత్మక చిత్రాన్ని అందించిన ఆర్కా మీడియా సంస్థ రూపొందించిన సరికొత్త రొమాంటిక్ సోషియో ఫాంటసీ హార్రర్ వెబ్ సిరీస్ యే యక్షిణి. ఈ వెబ్ సిరీస్ కు తేజా మార్ని దర్శకత్వం వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ స్పెషల్‌గా తీర్చి దిద్దారు. ఈ క్రేజీ వెబ్ సిరీస్ లో వేధిక, రాహుల్ విజయ్, అజయ్, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించి బోతున్నారు. అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ రోల్ పోషించబోతున్నట్లు సమాచారం.

Manchu Laxmi Romantic Socio Fantasy Horror Web Series Yakshini OTT Streaming Details Here

ప్రేమతో పాటు రొమాన్స్ కు చిహ్నం అయిన కృష్ణుడి కథ ఆధారంగా యక్షిణి వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. శాపగ్రస్తులై భూమి మీద ఉన్న మాయ తనను కాపాడాలని వేడుకొంటుంది. యక్షిణిని కాపాడేందుకు వందమందిని తుదముట్టించి కృష్ణుడు ఆమెకు విముక్తి కలిగించే కథతో వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇలా అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖు ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.

ముఖ్యంగా జూన్ 14వ తేదీ నుంచి మంచు లక్ష్మి యక్షిణి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యే ఎక్స్ వేదికగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బంగ్లా, మరాఠీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు వివరించింది. ఈ విషయం తెలుసుకున్న ఓటీటీ ప్రియులు అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ను చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

Manchu Laxmi Romantic Socio Fantasy Horror Web Series Yakshini OTT Streaming Details Here

హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ కథలను ఇష్ట పడే వాళ్లంతా కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. యక్షణి పేరుతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా సూపర్ సక్సెస్ సాధిస్తుందని.. ఆ టీం భావిస్తోంది. అదే విషయాన్ని అనేక ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు. మరి ఈ క్రేజీ వెబ్ సిరీస్ పై, అప్ డేట్లపై ఎప్పటికప్పుడు ఓ కన్నేస్తూ ఉండండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X