OTTలోకి రాబోతున్న సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్.. విపరీతంగా భయపెట్టే దీన్ని ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో ఓటీటీల జోరు ఎక్కువ అవుతోంది. నిన్న, మొన్నటి వరకు టీవీలూ చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన వారంతా ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా టీవీలు, సీరియల్స్ కంటే ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లు ఆసక్తికరంగా ఉంటుండడంతో.. వాటిని అర్థం చేసుకున్న చాలా మంది దర్శక, నిర్మాతలు సరికొత్త కథలతో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఆలోచనతోనే వచ్చిన ఈ క్రేజీ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. మరి ఆ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన క్రేజీ వెబ్ సిరీస్ యే యక్షిణి. వేధిక, రాహుల్ విజయ్, అజయ్, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించి బోతున్న ఈ వెబ్ సిరీస్ లో మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ రోల్ పోషించబోతున్నట్లు సమాచారం. డీ గ్లామరస్ లుక్ లో వేదిక కనిపించబోతుుండగా.. ఈ వెబ్ సిరీస్ అధ్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. బాహుబలి సినిమాలను నిర్మించిన బ్యానర్ యే ఈ క్రేజీ వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. అద్భుతమైన కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను అందరూ భయపడేలా రూపొందించనున్నారు.

Manchu Laxmi Socio Fantasy Web Series Yakshini OTT Streaming Details Here

అయితే మంచు లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించబోతున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీలోక రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అతి త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ను ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఈ సంస్థ నేరుగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా ప్రకటించింది. "అబ్బాయిలు జాగ్రత్త.. మీ కోసం త్వరలో యక్షిణి రాబోతుంది.. ఆమె వేట ప్రారంభం కాబోతుందంటూ" రాసుకొచ్చింది.

ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బంగ్లా, మరాఠీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న ఓటీటీ ప్రియులు అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ను చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు. హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ కథలను ఇష్ట పడే వాళ్లంతా కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. యక్షణి పేరుతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా సూపర్ సక్సెస్ సాధిస్తుందని.. ఆ టీం భావిస్తోంది. అదే విషయాన్ని అనేక ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు. మరి ఈ క్రేజీ వెబ్ సిరీస్ పై, అప్ డేట్లపై ఎప్పటికప్పుడు ఓ కన్నేస్తూ ఉండండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X