Ramp Addidham: మంచు మనోజ్ సాలిడ్ కమ్‌బ్యాక్.. ప్రోమోనే ఈ రేంజ్‌లో ఉంటే.. షో ఎలా ఉంటదో!
మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి వచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ హీరో మంచు మనోజ్. హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసిన అతడు.. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. దీంతో చాలా కాలం పాటు కెరీర్‌కు గ్యాప్ ఇచ్చి.. ఇటీవలే రెండు సినిమాలను ప్రకటించాడు. ఈ పరిస్థితుల్లో మంచు మనోజ్ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చాడు. అతడు ఓ షోను చేస్తున్నాడు. ఈ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో ఏముందో మీరే చూడండి!
మంచు మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించి 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు. దీంతో భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు.

మౌనికతో వివాహం తర్వాత మంచు మనోజ్ యాక్టింగ్ కెరీర్‌పై మళ్లీ ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా రెండు చిత్రాలను చేస్తున్నాడు. అందులో ఒకటి 'అహం బ్రహ్మస్మి' షూటింగ్ దాదాపుగా పూర్తైంది. అలాగే, ఇప్పుడు 'వాట్ ది ఫిష్' మూవీని కూడా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్టులూ చేయనున్నాడు.
వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న మంచు మనోజ్ ఓ టాక్ షోను కూడా చేయబోతున్నాడని చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు అతడు 'ఈటీవీ విన్' ETV Win ఓటీటీ సంస్థలో 'ర్యాంప్ ఆడిద్దాం' (ఈ పేరు ఇంకా ప్రకటించలేదు) అనే షోతో రాబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

తాజాగా వచ్చిన ప్రోమోలో మంచు మనోజ్ స్వరంతో 'నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచీ సినిమా మీద పెంచుకున్న ప్రేమ నా వృత్తిగా మారింది. నన్ను ఒక నటుడిగా, హీరోగానూ చేసింది. రాకింగ్ స్టార్ అని పేరు కూడా అందించింది. ఫ్యాన్స్, విజిల్స్, అరుపులు, కేకలు.. ఇలా ఒక పండగలా జరిగిన నా లైఫ్‌లోకి సడెన్‌గా ఒక నిశ్చబ్దం వచ్చింది. మనోజ్ అయిపోయాడన్నారు. కెరీర్ ఖతం అన్నారు. యాక్టింగ్ ఆపేశాడు ఇక తిరిగి రాడు అన్నారు. ఎనర్జీ స్టార్‌లో ఎనర్జీ తగ్గిందీ అన్నారు. విన్నాను.. చూశాను.. మౌనంగా భరించాను.. తిరిగొస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు.
మంచు మనోజ్ హోస్ట్ చేయబోతున్న 'ర్యాంప్ ఆడిద్దాం' షో ప్రోమో అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇందులో విజువల్స్, సెటప్ హై రేంజ్‌లో పెట్టారు. దీంతో ఈ షోపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ షోను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ర్యాంప్ ఆడిద్దాం' షలోకి కొందరు ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న సెలెబ్రిటీలు గెస్టులు వచ్చి గేమ్స్ ఆడతారని తెలిసింది. ప్రతి ఎపిసోడ్‌లో గెలిచిన వాళ్లకు రూ. 50 లక్షలు ప్రైజ్‌మనీ ఇస్తారట. దాన్ని ఆయా సెలెబ్రిటీల అభిమానులకు అందించేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











