కన్నప్ప ఓటీటీ రిలీజ్.. రెండు కండీషన్స్ కు ఒప్పుకుంటేనే డీల్.. ఏంటంటే?
టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకున్న చిత్రం 'కన్నప్ప'. మరికొద్ది రోజుల్లో గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతున్నది. దీంతో ప్రస్తుతం టీమ్ కన్నప్ప సినిమాను సౌత్, నార్త్ లో భారీగా ప్రమోట్ చేస్తున్నారు. మరోవైపు ఓవర్సీస్ లోనూ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 12నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.. కానీ బెస్ట్ అవుట్ పుట్ కోసమని కాస్తా డిలే చేశారు. మళ్లీ కొత్త తేదీని ప్రకటించి ప్రచారాన్ని వేగం చేశారు. భారీ అంచనాలు పెరిగిన ఈ చిత్రం ఓటీటీ రైట్స్ విషయంలోనూ మేకర్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఓటీటీ డీల్ విషయంలో మంచు విష్ణు రెండు కండీషన్స్ ను పెట్టుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తొలిసారి భారీ బడ్జెట్ తో కన్నప్ప..
మంచు ఫ్యామిలీని నుంచి వచ్చే సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రస్తుతం రిలీజ్ కార్యక్రమాల్లో మోహన్ బాబు, విష్ణు ఫుల్ బిజీగా ఉన్నారు. అవా ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల బడ్జెట్ తో మంచు మోహన్ బాబు గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా నటించడం విశేషం. మరోవైపు టాప్ టెక్నీషియన్లను హైర్ చేసుకుని బెస్ట్ అవుట్ పుట్ ను తీసుకొచ్చారని మేకర్స్ ఇప్పటికే చెప్పారు. దాంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది.

కన్నప్ప థియేట్రికల్, ఓటీటీ రిలీజ్ వివరాలు..
కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న తెలుగు తోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కొనుగోలు చేశాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ వివరాలు కూడా ఆసక్తికరంగా మారాయి. కన్నప్పపై భారీ హైప్ క్రియేట్ అవ్వడంతో ప్రముఖ ఓటీటీ సంస్థ ఒప్పందం చేసుకుందని మంచు విష్ణు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం 8 వారాల తర్వాతనే ఓటీటీలోకి రిలీజ్ చేయాలని, లేదంటే 4 వారాల్లోనే ఓటీటీలోకి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారంట. అదే సమయంలో ప్రేక్షకుల స్పందన అదిరిపోతే ఓటీటీ రైట్స్ ను ఒక రేట్ కు, లేదంటే మరో రైట్స్ కు తీసుకుంటామని ఓటీటీ సంస్థ కూడా కండీషన్ పెట్టిందంట. అందుకు మంచు విష్ణున భారీ నెంబర్ అడిగినట్టు తెలుస్తోంది.
కన్నప్ప థియేట్రికల్ రిలీజ్ ఇలా..
కన్నప్ప చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ను ఇప్పటికే పంపిణీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, తమళినాడులో రెడ్ జెయింట్ సినిమాలు, నార్త్ ఇండియాలో పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్, కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్, కేరళలో
ఆశీర్వాద్ సినిమాస్, హిందీలో యష్ రాజ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకుంది. ఇక ఓవర్సీస్ లో ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సొంతం చేసుకుంది.
కన్నప్ప ట్రైలర్ విశేషాలు..
తాజాగా కన్నప్ప ట్రైలర్ విడుదలైంది. జూన్ 14న విడుదల చేయడంతో ప్రస్తుతం యూట్యూబ్ లో #1లో ట్రెండ్ అవుతోంది. అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు 7 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ట్రైలర్ లో తిన్నడు పాత్రను బలంగా చూపించారు. మరోవైపు ప్రభాస్ రుద్రగా అలరించారు. ప్రభాస్ లుక్, డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక చిత్రంలో తిన్నడు, రుద్ర మధ్యనే ఎక్కువగా సన్నివేశాలు ఉండబోతున్నాయనేది తెలుస్తోంది. విజువల్స్, టేకింగ్, మ్యూజిక్ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











