PS2 OTT: ఓటీటీలో 'పొన్నియన్ సెల్వన్ 2'.. రెంట్ విధానంలో రిలీజ్.. ఫ్రీగా మాత్రం ఆరోజు నుంచే!
తమిళ అగ్ర దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మంచి విజయం సాధించింది. దీంతో ఆయన రెండో పార్టును కూడా తెరకెక్కించి ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చాలా వరకు ప్రేక్షకులు పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2ను థియేటర్లలో చూసేందుకు ఇష్టపడలేదు. దీంతో తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు అయింది.
చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి అగ్ర తారలు నటించిన చిత్రమే పొన్నియన్ సెల్వన్ 2. మొదటి పార్టుకు మంచి హిట్ కావడంతో రెండు పార్టును చిత్రీకరించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై మణిరత్నం, సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించారు. మణిరత్నం దర్శకత్వం ఈ చిత్రాన్ని సుమారుగా రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన పొన్నియన్ సెల్వన్ 2 చిత్రాన్ని ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి మంచి టాక్ వచ్చింది. కానీ రూ. 335 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు రూ. 308 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాక ప్లాపుగా మిగిలిపోయిందనే చెప్పవచ్చు. ఇక తర్వాతి సినిమాలు సందడి చేయడంతో పలు థియేటర్లలో సినిమాను ఎత్తేశారు.
అయితే ఈ క్రమంలో పొన్నియన్ సెల్వన్ 2 ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను మే 26 నుంచి రెంట్ విధానంలో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుందని సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అద్దె విధానంలో మే 26 నుంచి పొన్నియన్ సెల్వన్ 2 స్ట్రీమింగ్ కానుంది. అలాగే జూన్ 28 నుంచి ఈ సినిమాను ఫ్రీగా చూసే వెసులుబాటును కల్పించారు. ఇప్పటికే ఈ విషయం దాదాపుగా ఖరారు కాగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పొన్నియన్ సెల్వన్ 2 ఓటీటీ రైట్స్ ను అమెజాన్ రూ. 120 కోట్లకు కొనుగోలు చేసిందని టాక్.


Click it and Unblock the Notifications











