OTTలోకి రజనీకాంత్ సినిమానే దెబ్బకొట్టిన ఎమోషనల్ లవ్ డ్రామా.. ఎందులో చూడాలంటే?
ఓటీటీలోకి సూపర్ హిట్ లవ్ ఎమోషనల్ డ్రామా వచ్చేసింది. థియేటర్లలో రజినీ కాంత్ లాల్ సలాం సినిమాను భారీగా దెబ్బకొట్టిన సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది. అదేంటో కాదు.. జై భీమ్ ఫేం మణికందన్ హీరోగా నటించిన ట్రూ లవర్. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో బాగా దూసుకుపోతుంది. లవ్ చేేసే వాళ్లు, లవ్ చేయబోయే వాళ్లు, లవ్ బ్రేకప్ అయ్యే వాళ్లు ఈ సినిమా చూడాలని మేకర్స్ చెప్పుకువచ్చారు. అసలు ఈ చిత్రంలో ఏం ఉంది.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
చిన్న సినిమాగా వచ్చి...
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లాల్ సలాం సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన గెస్టు రోల్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఇక ఈ సినిమాకు పోటీగా ట్రూ లవర్ అనే సినిమా థియేటర్లోకి వచ్చింది. ఇక ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టించింది. సూపర్ హిట్టుగా నిలిచింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.

లవ్ ఎమోషనల్ డ్రామాగా...
ఇక ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాలో జైభీమ్ ఫేం మణికందన్ హీరోగా, శ్రీ గౌరిప్రియ హీరోయిన్ గా నటించారు. ఇక ఈ లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రూ లవర్ తమిళంలో లవర్ పేరుతో రిలీజై సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో ట్రూ లవర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ట్రూ లవర్ సినిమాలో కన్నా రవి, శరవణన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. సీన్ రోల్డాన్ సంగీతం అందించగా... ప్రముఖ డైరెక్టర్ మారుతి, బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ సంయక్తంగా తెలుగులో రిలీజ్ చేశారు.
రజినీ సినిమాకే దెబ్బ...
యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ట్రూ లవర్ సినిమాను తెరకెక్కించగా.. తెలుగులో ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా యూత్‌కు బాగానే కనెక్ట్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. తమిళంలో అయితే రజనీకాంత్ లాల్ సలామ్ సినిమాను మించి వసూళ్లు సాధించాయి. తెలుగులోనూ గట్టిగా ప్రమోషన్లు నిర్వహించడంతో సూపర్ హిట్టుగా నిలిచింది.

ఓటీటీలో సందడి...
ఈ నేపథ్యంలో థియేటర్లలో ఆడియెన్స్‌ను మెప్పించిన ట్రూ లవర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు సినీ ప్రేక్షకులు.
ట్రూ లవర్ సినిమా కథ విషయానికి వస్తే..
కాలేజీ రోజుల నుంచి అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీగౌరిప్రియ) ప్రేమించుకుంటారు. అయితే దివ్యను అరుణ్ అనుమానిస్తూ ఉంటాడు. వేరొకరితో మాట్లాడినా సహించలేకపోతుంటాడు. ఇక దివ్య అతనికి బ్రేకప్ చెప్పాలని అనుకుంటుంది. అదే సమయంలో తన స్నేహితులతో కలిసి టూర్ కు వెళ్తుంది దివ్య. ఆమె వెంట అరుణ్ కూడా వెళ్తాడు. మరి అక్కడ ఏమైంది? అరుణ్ ప్రవర్తనలో మార్పు వచ్చిందా? ఈ ప్రేమకథ సుఖాంతమైందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరి ఈ వీకెండ్ కు మీకు మంచి ఆప్షన్ ట్రూలవర్.


Click it and Unblock the Notifications











