PS 1 OTT: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 ఓటీటీ రిలీజ్.. ఎప్పుడంటే?

ఒకప్పుడు అసలైన ఫ్యాన్ ఇండియా సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన సంచలన దర్శకుడు మణిరత్నం తన కెరీర్లో మొదటిసారి పొన్నియిన్ సెల్వన్ అనే బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించారు. ఇక PS 1 సినిమా విడుదలకు ముందే తమిళంలో అయితే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. తెలుగులో పెద్దగా బజ్ క్రియేట్ చేయకపోవడం వలన కలెక్షన్స్ కూడా అంతగా ఏమీ రాలేదు.

కానీ మణిరత్నం మేకింగ్ పై మాత్రం ఓవర్గం ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఓవర్గం ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఓటీటీలో చూడడానికే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఇక ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అయితే ఈ సినిమాను థియేట్రికల్ గా 50 రోజులు ఆడిన తర్వాతనే ఓటీటీలో విడుదల చేయాలి అని ఒప్పందం చేసుకున్నారు. ఇక ఇప్పుడు నవంబర్ మొదటి వారంలో లేదా రెండవ వారంలోనే PS 1 సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళంలో ఇటీవల అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో PS 1 ఒకటిగా నిలిచింది.

Maniratnam biggest movie Ponniyin Selvan 1 new ott release update

ఇక తెలుగులో మాత్రం పెట్టిన పెట్టుబడికి పెద్దగా లాభాలు అయితే ఏమీ రాలేదు. మిగతా భాషల్లో కూడా అంతంతమాత్రంగానే ఈ సినిమా ఆడింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం తమిళ భాషలోనే ఎక్కువ కలెక్షన్స్ అందుకుంది. దాదాపు 500 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక సినిమా మొత్తానికి సక్సెస్ కావడంతో ఇప్పుడు మణిరత్నం మరింత హై రేంజ్ లో సెకండ్ పార్ట్ ను తెరపైకి తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు. సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా కొంత ఇదివరకే పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది చివరలో సెకండ్ పార్ట్ ను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X