ఓటీటీలోకి ఒళ్లు గగుర్పొడిచే థ్రిల్లర్ మూవీ.. 236 కోట్ల సినిమాను ఎలా చూడాలంటే!
ఇండియాలోని అన్ని సినిమా ఇండస్ట్రీల కంటే మలయాళ పరిశ్రమ వరుసగా హిట్లు మీద హిట్లను అందుకుంటూ ఫుల్ జోష్‌తో దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలోనే ఈ ఇండస్ట్రీ నుంచి ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ మూవీలు వచ్చాయి. అలా కొద్ది రోజుల క్రితం వచ్చిన మరో సెన్సేషనల్ సినిమానే 'మంజుమ్మెల్ బాయ్స్'. ఈ సినిమా దేశ వ్యాప్తంగా హైలైట్ అయిన విషయం తెలిసిందే.
శోభిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్, అభిరాం ప్రధాన పాత్రల్లో చిదంబరం తెరకెక్కించిన సినిమానే 'మంజుమ్మెల్ బాయ్స్'. కోడైకెనాల్‌లోని ఒక ప్రమాదకరమైన గుహను చూడటానికి కేరళ నుండి స్నేహితుల బృందానికి జరిగిన నిజ సంఘటన ఆధారంగా ఈ మూవీ రూపొందింది. దీంతో ఎన్నో అంచనాలతో ఇది రిలీజ్ అయింది.

ఆద్యంతం ఉత్కంఠను రేపే కథతో తెరకెక్కిన 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ ఫిబ్రవరి 22వ తేదీన మలయాళంలో విడుదలైంది. దీనికి అక్కడి ప్రేక్షకులు అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా ఈ చిత్రం ఏకంగా రూ. 236 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి టాప్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత చాలా భాషల్లోకి దీన్ని డబ్బింగ్ చేశారు. అంతటా ఇది హిట్ అయింది.
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి మంచి పోటీనే వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ సినిమాను సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్నే ముట్టజెప్పింది. ఇక, తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్‌పై హాట్‌స్టార్ ప్రకటన వదిలింది.

'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ మేరకు తాజాగా సదరు సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సైతం స్ట్రీమింగ్ చేస్తున్నట్లు హాట్‌స్టార్ తెలిపింది. అంతేకాదు, ఓ ట్రైలర్‌ను సైతం విడుదల చేసింది. దీంతో సినీ ప్రియులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. చిదంబరం దర్శకత్వంలో శోభిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్, అభిరాంలు నటించిన 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీని శోభున్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీలు నిర్మించారు. దీనికి సుషిన్ శ్యామ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రం కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 236 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











