ఓటీటీలోకి వచ్చేసిన 236 కోట్ల థ్రిల్లర్ మూవీ.. రెప్ప వేయకుండా చేసే దీన్ని ఎక్కడ చూడాలంటే!

రియల్ స్టోరీలతో వచ్చే సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంటుంది. అందుకే ఈ మధ్య కాలంలో ఈ తరహా చిత్రాలు చాలా భాషల్లో రూపుదిద్దుకుంటున్నాయి. అలా కోడైకెనాల్‌లోని ఒక ప్రమాదకరమైన గుహను చూడటానికి కేరళ నుండి స్నేహితుల బృందానికి జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమానే 'మంజుమ్మెల్ బాయ్స్'.

మలయాళ పరిశ్రమకు చెందిన శోభిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్, అభిరాం ప్రధాన పాత్రల్లో చిదంబరం తెరకెక్కించిన సినిమానే 'మంజుమ్మెల్ బాయ్స్'. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో భారీ అంచనాలతో ఇది విడుదల అయింది.

Manjummel Boys Movie Streaming Started on Disney plus Hotstar

ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేసిన 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ ఫిబ్రవరి 22వ తేదీన మలయాళంలో విడుదలైంది. దీనికి అక్కడి ఆడియెన్స్ అదిరిపోయే రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఈ చిత్రం ఏకంగా రూ. 236 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత చాలా భాషల్లోకి దీన్ని డబ్బింగ్ చేయగా.. అంతటా ఇది హిట్ అయింది.

క్రేజీ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి గట్టి పోటీనే ఎదురైంది. అందుకు అనుగుణంగానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్నే ముట్టజెప్పింది. ఇక, ఈ చిత్రాన్ని మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది.

Manjummel Boys Movie Streaming Started on Disney plus Hotstar

క్షణ క్షణం ఉత్కంఠ రేపేలా రూపొందిన 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఈ అర్ధరాత్రి నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ప్రారంభించింది. దీన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సైతం స్ట్రీమింగ్ చేస్తోంది. అన్ని చోట్లా ఈ చిత్రానికి ఓటీటీలో అదిరిపోయే స్పందన లభిస్తున్నట్లు తెలిసింది. మరి ఇందులో కూడా ఈ మూవీ రికార్డులు తిరగ రాస్తుందేమో చూడాలి.

ఇదిలా ఉండగా.. చిదంబరం దర్శకత్వంలో శోభిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్, అభిరాంలు నటించిన 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీని శోభున్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీలు నిర్మించారు. దీనికి సుషిన్ శ్యామ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రం కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తోనే రూపొందిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X