ది ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ ఫినిష్ .. పార్టీలో సమంత కిరాక్ .. అందరి చూపు ఆ ఇద్దరిపైనే

కోవిడ్ సమయంలో ఓటీటీలు అందుబాటులోకి వచ్చి పలు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించాయి. అలాంటి వాటిలో ది ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి. కామెడీ, యాక్షన్ , దేశభక్తి అన్ని కలగలిపి తీసిన ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఇండియాలోనే టాప్ వెబ్ సిరీస్‌గా నిలిచింది. బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పాయ్, సౌత్ హీరోయిన్ సమంతలకు భారీ పాపులారిటీ తీసుకొచ్చింది ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్.

2019 సెప్టెంబర్ 20న అమెజాన్ ప్రైమ్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ తొలి సీజన్ రిలీజై ఒక ఊపు ఊపింది. దానికి సీక్వెల్‌గా 2021 జూన్ 4న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 స్ట్రీమింగ్‌లోకి వచ్చి రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. భారత గూఢచార విభాగంలో పనిచేసే ఓ వ్యక్తి, అతని కుటుంబం.. విధి నిర్వహణలో అతనికి ఎదురయ్యే పరిస్ధితులను ఇందులో చూపించారు. తొలి సీజన్‌లో భారత్‌పై ఉగ్రవాదులు చేసే కుట్రలు, దాడులను ఎదుర్కోవడం చూపించారు. రెండో సీజన్‌లో తమిళ టైగర్స్‌పై స్పెషల్ ఆపరేషన్ వంటివి ప్రజలకు బాగా ఎక్కాయి.

Manoj Bajpayee and samantha ruth prabhu s The Family Man Season 3 wrap up party

సెకండ్ సీజన్‌లో సమంత రంగ ప్రవేశంతో ఈ సీరిస్‌కు సౌత్‌లోనూ మంచి ఆదరణ దక్కింది. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో సమంత ఎంతో కష్టపడ్డారు. రెండు సీజన్‌లు విజయవంతం కావడంతో మూడో సీజన్‌ను కూడా పట్టాలెక్కించింది యూనిట్. ది ఫ్యామిలీ మ్యాన్ 3లో కోవిడ్ 19, ఈశాన్య రాష్ట్రాలపై చైనా కుట్రలను ఇతివృత్తంగా తీసుకున్నట్లుగా బీటౌన్ టాక్. భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు చైనా ఎలాంటి కుట్రలు చేసింది? వాటిని హీరో అతని టీమ్ ఎలా కనిపెట్టి, శత్రువును మట్టికరిపించింది అన్నదే మూడో సీజన్‌లో చూపించనున్నారు.

రాజ్ అండ్ డీకే స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మనోజ్ బాజ్‌పాయ్ ఆకట్టుకున్నారు. ఆయన సతీమణిగా ప్రియమణి నటించగా.. షరీబ్ హష్మీ , శ్రేయా ధన్వంతరీ, ఆశ్లేష ఠాకూర్, శరద్ ఖేల్కర్, వేదాంత్ సిన్హాలు కీలకపాత్రలు పోషించారు. అయితే తాజాగా వెబ్ సిరీస్‌లో సమంత ఎలాంటి పాత్ర పోషించారన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ది ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ ముగిసినట్లు దర్శకులు రాజ్ అండ్ డీకే ప్రకటించారు.

ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్‌లో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో కలిసి సమంత సందడి చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ముఖ్యంగా రాజ్ అండ్ డీకేలతో కలిసి ఉన్న ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటున్న ది ఫ్యామిలీ మ్యాన్ 3 ఈ ఏడాది చివరిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X