OTT: బూతు సీన్స్ తో షాకిచ్చిన మనోజ్.. ఓటీటీని షేక్ చేస్తున్న 'కొమరం పులి' విలన్

భారతీయ చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ నటీనటులకు ఎలాంటి కొదవ లేదు. దాదాపు అన్ని భాషల్లో కూడా అద్భుతంగా నటించే నటీనటులు ఉన్నారు. అయితే కొందరికి బిగ్ స్క్రీన్ పై అవకాశాలు వచ్చి మంచి పాత్రలు పడినప్పటికీ అండర్ రేటెడ్ లిస్ట్ లోనే ఉండిపోతారు. మరి అలాంటి వాటికి ఓటిటి ప్లాట్ ఫామ్ లు మంచి క్రేజ్‌ను తీసుకొస్తున్నాయి.

కాగా ఇలా బిగ్ స్క్రీన్స్ పై అంతగా గుర్తింపు లేక ఓటిటిలో సంచలనం సెట్ చేసిన నటుల్లో ప్రముఖ హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కూడా ఒకరు. తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్ కొమరం పులి సినిమాలో విలన్ గా అద్భుతంగా నటించాడు. అలాగే అల్లు అర్జున్ తో హ్యాపీ, ఇంకా వేదం సినిమాల్లో ఈ టాలెంటెడ్ నటుడు మంచి పాత్రలు చేశారు. కానీ తన పెర్ఫామెన్స్ కి తగ్గ ఐకానిక్ రోల్స్ మాత్రం అంతగా బిగ్ స్క్రీన్స్ పై పడలేదు.

manoj bajpayee despatch shakes ott and internet with adult scenes

అయితే ఈ నటుడు ఎప్పుడైతే ఓటిటిలో ఎంట్రీ ఇచ్చారో అక్కడ నుంచి తన దశ మారింది అని చెప్పాలి. ఇండియాస్ సెన్సేషనల్ హిట్ సిరీస్ "ది ఫ్యామిలీ మ్యాన్"లో మెయిన్ లీడ్ గా నటించిన తాను అక్కడ నుంచి ఓటిటిలో స్టార్ అయ్యారు. ఇక అక్కడి నుంచి మరింత ఫేమ్ ని తెచ్చుకుంటే ఓటిటిలో మరిన్ని సిరీస్ లు చేశారు.

అయితే ఇన్ని సిరీస్ లు సినిమాలు చేసినప్పటికీ తాను ఎప్పుడు ఓ బోల్డ్ సీన్స్ లో కానీ అడల్ట్ కంటెంట్ సీన్స్ లో కానీ చేసింది దాదాపు లేదనే చెప్పాలి. ఇలాంటి నటుడి నుంచి ఒక్కసారిగా ఊహించని షాక్ వచ్చింది. ఆయన రీసెంట్‌గా నటించిన రీసెంట్ చిత్రం "దేశ్పాచ్" ని ఓటిటిలో చూసిన వారంతా సోషల్ మీడియాలో మనోజ్ గురించి హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు.

అసలు ఇన్ని బూతు సీన్స్ లో మనోజ్ నిజం గానే నటించాడా? అసలు తన నుంచి ఈ రేంజ్ యాంగిల్ ని ఊహించలేదు అంటూ షాకవుతున్నారు. అలాగే ఇంకొందరైతే బాలీవుడ్ ఫేమస్ రొమాంటిక్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీని సైతం మనోజ్ ఇపుడు మించిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో సోషల్ మీడియా సహా ఓటిటిని ఇపుడు ఈ సినిమా షేక్ చేస్తుంది.

అన్నట్టు ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ జీ 5 వారు రీసెంట్ గానే తీసుకురాగా హిందీ భాషలో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతుంది. ఐతే ఈ సినిమా కంటెంట్ అంత పేలకపోయినప్పటికీ ఈ ఇందులోని బోల్డ్, బూతు సన్నివేశాల దెబ్బకి మరీ ముఖ్యంగా మనోజ్ లాంటి నటుడు ఇన్వాల్వ్ అవ్వడంతో సంచలనమై కూర్చుంది. ఇక ఈ సినిమా పక్కన పెడితే మనోజ్ బాజ్‌పాయ్ హిందీలోనే మరిన్ని సినిమాలు సిరీస్ లు చేస్తుండగా "ది ఫ్యామిలీ మ్యాన్" కి మూడో సీజన్లో కూడా తాను కొనసాగనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X