OTTలోకి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా.. ఎందులో చూడాలంటే?
ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఓటీటీ సంస్థలు కూడా సరికొత్త కంటెంటును తీసుకువస్తున్నారు. అందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ మరో కొత్త వెబ్ సిరీసును తీసుకువచ్చేందుకు రెడీ అయింది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఫేం మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ కిల్లర్ సూప్. ఈ సిరీసును నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుంది. ఆ వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయి 'ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సిరీస్ కిల్లర్ సూప్. ఇది ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. అభిషేక్ చౌబే ఈ సిరీసుకు దర్శకత్వం వహించారు.

అభిషేక్ చౌబే గతంలో ఉడ్తా పంజాబ్, సోంచారియా వంటి డార్క్ క్రైమ్ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మరోసారి విజయాన్ని సొంతం చేసుకునేందుకు కిల్లర్ సూప్ తో ముందుకు రానున్నారు. కొంకణా సేన్ శర్మ ఈ సిరీసులో హీరోయిన్ గా నటిస్తోంది. నాజర్, షయాజీ షిండే, లాల్, రాజీవ్ రవీంద్ర నాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే కిల్లర్ సూప్ సిరీస్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇటీవల కిల్లర్ సూప్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. సుమారు 2 నిమిషాల 22 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను కలిగించింది. అసలు స్టోరీ గురించి ఏ మాత్రం హింట్ ఇవ్వకుండా సిరీసుపై మరింత ఆసక్తిని పెంచేశారు మేకర్స్. ముఖ్యంగా ట్రైలర్ మధ్యలో వినిపించే బాంబే సినిమాలోని తూహీరే సాంగ్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. జనవరి 11న హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ క్రైమ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రైమ్ సిరీసులో మనోజ్ బాయ్ పాయ్ ద్విపాత్రభినయం చేశారు. తన కెరీర్ లో మొదటి సారిగా తాను ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఇప్పటికే తెలిపారు. రెండు పాత్రలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని స్పష్టం చేశారు.
ఇక ఈ వెబ్ సిరీసుకు అభిషేక్ చౌబే దర్శకత్వం చాలా బాగుందని తెలిపారు. కిల్లర్ సూప్ అనేది ఒక క్రైమ్ థ్రిల్లర్ కావొచ్చని.. కానీ అందరినీ అలరిస్తుందని మనోజ్ బాజ్ పేయ్ వివరించారు. ఇక ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసు రేపు అనగా జనవరి 11న నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హింధీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఓటీటీలో ఎంచాక్క ఇంట్లోనే కూర్చొని చూసేయండి.


Click it and Unblock the Notifications











