OTTలోకి మరో సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ సీక్వెల్ - ప్రతీ సీన్ ఉత్కంఠగా సాగే సస్పెన్స్‌తో!
ఓటీటీలో భాషలో సంబంధం లేకుండా క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్స్‌కు ఫుల్ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే ఓటీటీ సంస్థలు వాటిపైనే ఫోకస్ ఎక్కువ పెట్టి వాటిని తెరకెక్కిస్తున్నారు. ఆడియెన్స్‌కు వాటిని డైరెక్ట్‌గా అందిస్తున్నారు. అవి ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరొక మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయిపోయింది. గతంలో వచ్చిన ఓ బ్లాక్ బస్టర్ మర్డర్ మిస్టరీ సినిమాకు సీక్వెల్ ఇది రాబోతుంది. దీనిపైన మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు, ఎక్కడ, ఎందులో స్ట్రీమింగ్ కానుందో పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
మనోజ్ బాజ్‌పేయి ఈ పేరుకు ఓటీటీలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. థియేటర్లలో అంతగా సక్సెస్ కానీ ఈ స్టార్ యాక్టర్ డిజిటల్ ప్లాట్ఫామ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన నటించిన ఏ సినిమా లేదా సిరీస్ అయినా మంచి అంచనాలు ఏర్పడతాయి. కచ్చితంగా అది సగటు ప్రేక్షకుడిని అలరిస్తుందనే గ్యారంటీ ఉంటుంది. అలా తాజాగా ఆయన ఇప్పుడో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

దాని పేరే సైలెన్స్ 2 - ది నైట్ ఔల్ బార్ షూటౌట్. గతంలో సైలెన్స్ పేరుతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఆ సినిమాకు ఇప్పుడు ఇది సిక్వెల్‌గా రానుంది. మొదటి భాగంలోనూ మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్‌లో నటించారు. ఇది మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొంది 2021లో రిలీజైంది. అప్పట్లో ఇది సెన్సేషనల్ హిట్‌గా టాక్ తెచ్చుకుంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారికి సైలెన్స్ బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది. అందుకే ఇప్పుడు సైలెన్స్ 2పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇది కూడా ఆద్యంతం సస్పెన్స్‌తో థ్రిల్లింగ్‌గా సాగింది. అబన్ బరూచా దేవ్‌హన్స్ ఈ చిత్రానికి దర్శకుడు. జీ స్టూడియోస్, క్యాండిడ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రాచీ దేశాయ్ మరో కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్ 16 నుంచి ఇది జీ5లో నేరుగా రిలీజై స్ట్రీమింగ్ కానుంది. కానీ ప్రస్తుతానికి హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

కథ విషయానికొస్తే సైలెన్స్ 2 ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. నైట్ ఔల్ అనే బార్లో జరిగిన షూటౌట్‌తో మొదలైన ఈ ప్రచార చిత్రంలో కేసును ఛేదించేందుకు అవినాష్ అండ్ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత బార్‌లోని క్రైమ్ సీన్లో షూటౌట్ జరిగిన విధానాన్ని విశ్లేషిస్తూ ఓ అమ్మాయిని ముందు నుంచి ఆ షూటర్ ఎందుకు కాల్చాడన్న ప్రశ్నతో కథ ముందుకు సాగుతుంది. అనంతరం నగరంలో మరిన్ని వరుస షూటౌట్లు జరుగుతాయి. పలువురిని హత్య చేసి చంపేస్తారు. వారిలో ముఖ్యంగా లేడీస్ ఉంటారు. అసలెవరు ఈ హత్యలు చేస్తున్నారు? ఆ తర్వాత ట్విస్టులు, సవాళ్లతో కథ ముందుకు ఎలా సాగింది? మరి హంతకులను చివరికి పట్టుకున్నారా లేదా అన్నదే మిగతా కథ.


Click it and Unblock the Notifications











