Bandaa OTT: నేరుగా ఓటీటీలో రిలీజైన సినిమా ఇప్పుడు థియేటర్‌లోకి.. తొలి చిత్రంగా రికార్డ్
స్టార్ హీరోయిన్ సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సీజన్ 2 ద్వారా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. అయితే ఆమెకంటే ముందే 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ సెన్సేషనల్ హిట్ అయింది. దానికి ప్రధాన కారణాల్లో ఒకటి సిరీసులో మెయిన్ లీడ్ రోల్ చేసిన మనోజ్ బాజ్ పాయ్. పొటేన్షియాలిటీ ఉన్న నటుల్లో ఆయన ఒకరు. అల్లు అర్జున్ హ్యాపీ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన అనేక సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించారు. ఇటీవల కాలంలో ఆయన ఎక్కువగా ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తున్నారు. అందులో ఒకటే నేరుగా ఓటీటీలో రిలీజైన తర్వాత థియేటర్లలో విడుదలై రికార్డ్ క్రియేట్ చేసింది.
భిన్నంగా:ప్రస్తుతం సినిమా ఏదైనా సరే ముందుగా థియేటర్లో విడుదలవుతుంది. ఆ తర్వాత దాని రెస్పాన్స్ బట్టి ఓటీటీల్లోకి రిలీజ్ చేస్తారు. లేదంటే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదలవుతుంటాయి. అయితే వీటన్నింటికి భిన్నంగా ఓ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ నుంచి థియేటర్ లోకి అడుగు పెట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది.
మే 23 నుంచి:బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ (Manoj Bajpayee) మెయన్ లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ మూవీ 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' (Sirf Ek Bandaa Kaafi Hai) అంటే తెలుగులో 'ఒక్క వ్యక్తి చాలు' అని. కోర్డ్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు అపూర్వ సింగ్ కర్కీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 23న ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రశంసలు-నిర్ణయం:'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' సినిమాలో మనోజ్ బాజ్ పాయ్ నటనకు ప్రశంసలు కురిశాయి. మూవీ చాలా బాగుందంటూ సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ఓ వినూత్న ప్రయత్నం చేపట్టింది. ఓవైపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను థియేటర్ లో కూడా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

గతంలో కలర్ ఫోటో:ముంబయిలోని బోరివాలి, బాంద్రా, డోంబివిలి ప్రాంతాల్లోని థియేటర్లలో 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' సినిమాను జూన్ 2 నుంచి ప్రదర్శిస్తున్నారు. దీంతో ఓటీటీలోకి విడుదలైన 10 రోజుల్లోనే థియేటర్లోకి వచ్చిన తొలి చిత్రంగా ఈ మూవీ క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో కలర్ ఫోటో మూవీ కూడా ఓటీటీ నుంచి థియేటర్ లోకి అడుగు పెట్టింది. కానీ అది కొన్ని నెలల సమయం తర్వాత రిలీజైంది.

తెలుగులో కూడా:ప్రస్తుతం థియేటర్లలో, జీ5 ఓటీటీలో హిందీ భాషలో ప్రదర్శితమవుతున్న 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' మూవీని తెలుగులోకి కూడా తీసుకురానున్నారు. జూన్ 7 నుంచి జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన తెలుగు ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది. కాగా సమాజంలో దేవుడిగా కొలిచే బాబా తనను వేధించాడంటూ పోలీసులను ఆశ్రయించిన ఓ యువతి కథాంశంగా చిత్రం తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











