సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలే వస్తున్నాయి. ఎక్కువా హిట్లు కొట్టేవి కూడా అవే కావడంతో మేకర్స్ తో ఎక్కువగా అలాంటి చిత్రాలే తీసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఓ అద్భుతమైన సర్వైకర్ థ్రిల్లర్ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. సినిమా విడుదలకు ముందు పలు అంతార్జీతయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించిన ఈ చిత్రం.. ఎన్నెన్నో అవార్డులను దక్కించుకుంది. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచి ఎంతో మంది సినీ ప్రియుల మదిని దోచింది. అయితే ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనోజ్ బాజ్ పేయీ హీరోగా 2023 డిసెంబర్ 8వ తేదీన వచ్చిన సూపర్ డూపర్ హిట్టు చిత్రమే జొరమ్. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించారు. అలాగే మఖిజా ఫిల్మ్‌తో కలిసి జీ స్టూడియోస్ నిర్మించింది. ఇందులో మనోజ్ బాజ్‌పేయి సరసన తన్నిష్ఠ ఛటర్జీ నటించింది. అలాగే రాజశ్రీ దేశ్ పాండే, మహమ్మద్ జీషన్ ఆయుబ్, స్మితా తాంబే వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే సినిమా విడుదలకు ముందు పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు.

2023 ఫిబ్రవరిలో నెదర్లాండ్స్ లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రోరట్ డ్యామ్ లో తొలిసారి ప్రదర్శించగా.. జూన్ లో ఆస్ట్రేలియా సిడ్నీలో 70వ సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్ లో చూపించారు. ఆ తర్వాత జులైలో డర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ దక్షిణాఫ్రికాలో, అక్టోబర్ లో దక్షిణ కొరియాలో జరిగిన 28వ బుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంతో పాటు అదే నెలలో చికాగోలో 59వ చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఇప్పటికే మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వేధికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈరోజు నుంచే ఈ సినిమా అమెజామ్ ప్రైమ్ లో అందుబాటులోకి రాగా.. కేవలం రెంట్ విధానంలో మాత్రమే చూడొచ్చు. ఇప్పటి వరకు ఈ సూపర్ డూపర్ హిట్టు చిత్రాన్ని చూడని వాళ్లు ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











