The Family Man Season 3 : ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్? ఎప్పుడు, ఎక్కడ?
బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాయ్ పేయ్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న టీవీ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్', 2019లోనే ఈ సిరీస్ రిలీజ్ అయ్యి ఓటీటీలో సంచలనం సృష్టించింది. రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వంలో ఈ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. డీ2కే ప్రొడక్షన్ లో నిర్మించారు. ఇప్పటికీ 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ లు విడుదలైన విషయం తెలిసిందే. సాధారణ కుటుంబానికి చెందిన మనోజ్ బాయ్ పేయ్ ఓవైపు సింపుల్ లైఫ్ ను గడుపుతూనే మరోవైపు ఇంటెలిజెన్స్ అధికారిగానూ విధులు నిర్వహిస్తూ ఉంటారు.
శ్రీకాంత్ తివారీగా మనోజ్ వాజ్ పేయ్, సుచిత్ర తివారీగా ప్రియమణి భార్యభర్తలుగా నటించారు. ఇక ఈ సిరీస్ లో టాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన విషయం తెలిసిందే. సందీప్ కిషన్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా... సమంత మాత్రం సీజన్ 2కే పరిమితమైంది. ఈ స్పై థ్రిల్లర్ గత రెండు సీజన్లు మంచి వ్యూయర్ షిప్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఇండియాలోనే డిమాండ్ ఫుల్ సిరీస్ ఇది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి కాగా.. ప్రస్తుతం మూడో సీజన్ పై ఓటీటీ ప్రేక్షకుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది. సీజన్ 3ని రిలీజ్ డేట్ పై ఓ బజ్ వినిపిస్తోంది. ఈ ఏడాది దీపావళి 2025 సందర్భంగా 'ది ఫ్యామిలీ మ్యాన్ 3'ని రిలీజ్ చేయబోతున్నారు. దీపావళి వీలైతే దీపావళికి ముందే విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది. మొదటి సీజన్ 2019 సెప్టెంబర్ 20న అమోజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. రెండో సీజన్ 2021 జూన్ 4న విడుదల చేశారు. అయితే నాలుగేళ్ల తర్వాత 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' రిలీజ్ కు సిద్ధం కావడం గమనార్హం. మూడు ఏళ్లుగా ఆడియెన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఇక మూడో సీజన్ లో శ్రీకాంత్ తివారీ, ప్రియమణి, సందీప్ కిషణ్, షరిబ్ హష్మీ, అశ్లేషా ఠాకూర్, షరద్ కేల్కర్, దలిప్ పాత్రలు కొనసాగనున్నాయి. అదనంగా జైదీప్ హాల్వత్ పాత్ర జతకానుంది. ఏడాది కిందనే ఈ సీజన్ ఓటీటీలోకి విడుదల కావాల్సింది. కానీ కరోనా నేపథ్యంలో షూటింగ్ డీలే అయ్యింది. ఇప్పుడు అన్నీ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా పక్కా డేట్ ను టీమ్ కన్ఫమ్ చేయాల్సి ఉంది.
ఇండియన్ టీవీ సీరిస్ లను తెరకెక్కించడంలో రాజ్ అండ్ డీకే దిట్ట అనే విషయం 'ది ఫ్యామిలీ మెన్' సిరీస్ తోనే కాకుండా.. సమంత రూత్ ప్రభు, వరుణ్ ధావన్ లీడ్స్ గా రూపొందించిన 'సిటాడెల్ : హనీ బన్నీ'ను సూపర్ హిట్ చేసి కూడా ప్రూవ్ చేశారు. అంతకు ముందు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో 'ఫర్జీ' సిరీస్ ను కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే నుంచి 'ది ఫ్యామిలీ మెన్', 'సిటాడెల్', 'ఫర్జీ'.. మూడు సిరీస్ లు రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











