Manorathangal on OTT: కమల్, మోహన్ లాల్, మమ్ముట్టి కాంబోలో వెబ్ సిరీస్.. ఎప్పుడు? ఏ ఓటిటిలో అంటే?
ప్రస్తుతం మన దేశంలో కూడా ఓటిటి కంటెంట్ కి ఎలాంటి డిమాండ్ నెలకొందో చూస్తూనే ఉన్నాము. అందుకు తగ్గట్టుగానే పలు పాపులర్ ఓటిటి సంస్థలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి వారు దేశి, ఇంటర్నేషనల్ కంటెంట్ తో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటికే ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ మన ఇండియన్ ఓటిటి ప్లాట్ ఫామ్స్ వారు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నారు.
కాగా మన ఇండియాకి సంబంధించి ఉన్న స్ట్రీమింగ్ యాప్స్ లో జీ5 కూడా ఒకటి. కాగా ఇందులో రీజనల్ కంటెంట్ ఎక్కువగా దొరుకుతుంది. దీనితో జీ5 మరీ అంత పాపులర్ కాలేకపోతుంది. కాగా ఇపుడు మాత్రం ఒక క్రేజీ వెబ్ సిరీస్ ని వారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఇండియన్ లెజెండరీ నటులు ఉలగనయగన్ కమల్ హాసన్, మోలీవుడ్ మెగాస్టార్స్ మమ్ముట్టి అలాగే మోహన్ లాల్ లాంటి దిగ్గజాల కలయికలో ఓ ఆంథాలజీ సిరీస్ "మనోరథంగల్" ని ఇప్పుడు అనౌన్స్ చేశారు.

కాగా ఈ సిరీస్ మొత్తం 8 మంది దర్శకులు తెరకెక్కించారట. కాగా ఈ 8 మంది కూడా మొత్తం 9 ఎపిసోడ్స్ ని తెరకెక్కించారు. ఒల్లవం తీరవుం, శిలాలిఖతం అనే రెండు ఎపిసోడ్స్ ని ప్రియదర్శన్ తెరకెక్కించారు. కడుగన్నవ ఓరు యాత్ర - రంజిత్, కలఛా - శ్యామ్ ప్రసాద్, విల్పన - అస్వతి వి నైర్, షెర్లాక్ - మహేష్ నారాయణన్, స్వర్గం తురుక్కున సమయం - జయరంజన్ నైర్, అభయం తేడి వెండమ్ - సంతోష్ శివన్ ఇక ఫైనల్ గా కాదల్ కట్టు - రితేష్ అంబట్ లు తెరకెక్కించారట.
తాజాగా దీనిపై వచ్చిన ట్రైలర్ కూడా చూసేందుకు ఇంట్రెస్టింగ్ గా ఇంప్రెస్ చేసే ఎమోషన్స్ తో కనిపిస్తుంది. అయితే ఈ సిరీస్ లో మోహన్ లాల్, మమ్ముట్టి ఇంకా ఫహద్ ఫాజిల్, మధూ, బిజూ మీనన్, అపర్ణ బాలమురళి, నదియా లాంటి స్టార్ కాస్ట్ కనిపిస్తుండగా అందరిపై కూడా ఇంట్రెస్టింగ్ ఎమోషన్స్ తో కూడిన ఎపిసోడ్స్ ని ప్రామిస్ చేస్తున్నారు. మరి అందరి పేర్లపై సిరీస్ లో ఒకో కథ కనిపిస్తుంది.
కానీ కమల్ హాసన్ తో ఏం ప్లాన్ చేసారంటే వీరి అందరి కథలని నరేట్ చేసే వ్యక్తిగా కమల్ కనిపిస్తున్నారు. ట్రైలర్ లో కూడా తాను మళయాళమే మాట్లాడుతుండడం విశేషం. కాగా ఈ సిరీస్ ని మలయాళ ప్రముఖ రచయిత వాసుదేవన్ షార్ట్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కించారట. ఇక ఈ బిగ్ మల్టీ స్టారర్ సిరీస్ ని అయితే జీ 5 వారు ఈ ఆగస్ట్ 15న ఓటిటిలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
కాగా ఈ సిరీస్ ఒరిజినల్ మళయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ సహా హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఈ ఓటిటి సిరీస్ ఎలాంటి స్పందన ఓటిటి వీక్షకుల్లో మెయిన్ గా వారిని అభిమానించే వారిలో అందుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











