ఈవారం ఓటీటీలోకి ఆసక్తికరమైన కంటెంట్.. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు కూడా రెడీ!

ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం థియేటర్స్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఒటీటీ ద్వారా కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఇక వీటిలో చాలా వరకు ఆకట్టుకుంటున్నాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులకి వినోదాన్ని అందించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక వాటిలో కొన్ని థియేటర్స్ ద్వారా రిలీజ్ అవుతూ ఉండగా మరికొన్ని ఒటీటీలో రిలీజ్ అవుతూ సందడి చేయబోతున్నాయి.

ఇక ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోయే సినిమాలు చూసుకుంటే.. మార్చి 3న కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం మూవీ రిలీజ్ కాబోతుంది. ఇందులో ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించాడు. ఇక సోహైల్, మృణాలిని కాంబినేషన్ లో ఎస్వీ కృష్ణారెడ్డి చాలా కాలం తర్వాత దర్శకత్వం వహించిన 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' అదే రోజు రిలీజ్ కాబోతుంది. అలాగే రిచిగాడి పెళ్లి అనే చిన్న సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. సాచి అనే బయోపిక్ మూవీ కూడా మార్చి 3న రిలీజ్ కాబోతుంది.

March 1st week ott and theatrical movies release updates

దీంతో పాటు గ్రంథాలయం అనే మూవీ రిలీజ్ అవుతుంది. ఇక ఒటీటీలో రిలీజ్ కాబోయే వెబ్ సిరీస్ లు, సినిమాలను చూసుకుంటే 'ది మాండలోరిన్' అనే వెబ్ సిరీస్ మార్చి 1న హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది. అలాగే ఎలోన్ అనే మూవీ కూడా మార్చి3న హాట్స్ స్టార్ లో రిలీజ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో మార్చి 1, హీట్ వేవ్, మార్చి 2న సెకండ్ లైఫ్ అనే మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.

వీటితో పాటు ఇతర భాషలకి చెందిన వెబ్ సిరీస్ కూడా మార్చి 1 నుంచి 3 మధ్యలో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మొత్తానికి ఈ వారం కాస్తా హైప్ ఉన్న సినిమా అంటే బలగం అని చెప్పాలి. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై కొద్దిగా హైప్ ఉంది. ఇక మిగిలినవి అన్ని కూడా చిన్న సినిమాలుగా వస్తున్నాయి. అవి ఎంత వరకు ప్రేక్షకులకి రీచ్ అవుతాయనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X