OTT Movies: ఈ వారం ఓటీటీ వేధికగా 23 సినిమాలు రిలీజ్.. అందరి ఫోకస్ ఆ సినిమాలపైనే..
ఓటిటి హడావిడి పెరిగిపోయిన తర్వాత చాలామంది సినిమాలో థియేటర్లో చూడడం కూడా తగ్గించేశారు అని కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక నిర్మతలకు కూడా ఓటీపీ అనేది చాలా ఉపయోగపడుతోంది ఒకవేళ థియేటర్ గా డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఓటీపీ పరంగా వారికి మంచి డీల్స్ అయితే వస్తున్నాయి.
ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు ఓటీటీ వేధికగా విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా రేపు ఒక్కరోజే 23 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే అవి ఏ సినిమాలు, ఏ ఓటీటీ వేధికగా రిలీజ్ కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ వేధికగా
ఈవారం కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక అందులో ఏ సినిమాలపై ఎక్కువ స్థాయిలో ఎదురుచూస్తున్నారు అనే వివరాల్లోకి వెళితే. నెట్ ఫ్లిక్స్ వేధికగా.. ఇన్ హిజ్ షాడో అనే ఇంగ్లీష్ సినిమా, మ్యాస్ట్రో అనే ఇంగ్లీష్ సిరీస్, నాయిస్ అనే డచ్ సినిమా రేపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

ధనుష్ సార్
అలాగే నెట్ ఫ్లిక్స్ లో స్కై హై: ద సిరీస్ అనే స్పానిష్ వెబ్ సిరీస్, ద మెజీషియన్స్ ఎలిఫెంట్ అనే ఇంగ్లీష్ సినిమా, సార్ (తెలుగు) రేపు రిలీజ్ కాబోతున్నాయి. షాడో అండ్ బోన్ సీజన్2 (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది), కుత్తే అనే హిందీ సినిమా(ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది)

సోని లివ్, అమెజాన్ ప్రైమ్
ఇక సోనీ లివ్ లో చూసుకుంటే.. ద వేల్ అనే ఇంగ్లీష్, రాకెట్ బాయ్స్ అనే సీజన్ 2 అనే హిందీ వెబ్ సిరీస్ విడుదల కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ వేధికగా గంధదగుడి అనే డాక్యుమెంటరీ ఫిల్మ్, క్లాస్ ఆఫ్ 07 అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు కూడా శుక్రవారం నుంచి రిలీజ్ కాబోతున్నాయి.

రైటర్ పద్మభూషణ్
ఇక తెలుగు ఓటీటీ ఆహాలో సత్తిగాని రెండకరాల పొలం అనే తెలుగు సినిమా రాబోతోంది. ఇక లాక్డ్ చాప్టర్ 2 అనే తమిళ చిత్రం రేపటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అనే వెబ్ సిరీస్ కూడా రేపటి నుంచి విడుదల కాబోతుంది. జీ5లో రైటర్ పద్మభూషణ్ అనే తెలుగు చిత్రంతో పాటు సెవెన్ అనే బెంగాలీ సిరీస్ రేపుటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

మిగతా వాటిలో..
సన్ నెక్స్ట్ లో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ జమాలిగుడ్డ అనే కన్నడ చిత్రం, మనోరమలో మోమో ఇన్ దుబాయి అనే మలయాళ సినిమా, డిస్కవరీ ప్లస్ లో నేక్డ్ అండ్ ఎఫ్రైడ్: బ్రెజిల్ అనే పోర్చుగీస్ సిరీస్, లయన్స్ గేట్ ప్లే లో డ్వైర్ యాంగ్రీ అనే ఇంగ్లీష్ సినిమా, ఎక్స్ ట్రా పొలేషన్స్ అనే ఇంగ్లీష్ సిరీస్ బుక్ మై షోలో 5000 బ్లాంకెట్స్ అనే ఇంగ్లీష్ మూవీ రేపటి నుంచి నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











