నేరుగా OTTలోకి రాబోతున్న హ్యాట్రిక్ కొట్టిన ఆ డైరెక్టర్ మూవీ.. కారణం ఏంటి, ఎక్కడ చూడాలంటే?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించడంలో ఆయనను మించిన వాళ్లు లేరు. ముందుగా రచయితగా కెరియర్ ప్రారంభించిన ఈయన డైరెక్టర్ రామ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు. ఆ తర్వాత సినిమాలు తీయడంలో మెళుకువలు నేర్చుకుని 2018లో పరియేరుమ్ పెరుమాళ్ అనే సూపర్ డూపర్ హిట్టు సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా థియేటర్ల వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత మూడేళ్లకు మరోసారి కర్ణన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండోసారి హిట్టు కొట్టాడు.

ఆ తర్వాత ఏడాది అంటే 2022లో మామన్నన్ అనే మరో అద్భుతమైన చిత్రంతో వచ్చి హ్యాట్రిక్ కొట్టాడు. ఇలా ఈయన తెరకెక్కించిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్టు కావడంతో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈయనతో సినిమాలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే తాజాగా ఈయన మరో మంచి కథను డైరెక్ట్ చేశారు. ఈ అద్భుతమైన సినిమా పేరే వాజై. కలైయరాసన్, నిఖిలా విమల్, ప్రియాంక, దివ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా చాలా బాగుండబోతుందని టీజర్, పోస్టర్ లు చూస్తుంటేనే అర్థం అవుతుంది.

Mari Selvaraj Fourth Movie Vaazhai Streaming Detail Here

మూడు సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఈ డైరెక్టర్ తీసిన నాలుగో చిత్రం వాజైని మాత్రం నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయబోతున్నారని తెలిసి చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. కచ్చితంగా ఈ సినిమా కూడా హిట్టు అవుతుందని... మరి అలాంటి చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలోకి ఎందుకు తీసుకు రావాలనుకుంటున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓ ఓటీటీ వేధికగా విడుదల కాబోతుంది, ఎందుకు నేరుగా ఓటీటీలోకి వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దివ్య మారి సెల్వరాజ్, మారి సెల్వరాజ్ లు... ప్రముఖ ఓటీట సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నవ్వి స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్రాన్ని నిర్మించడం వల్లే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. అయితే న్యూ ఇయర్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ... ఈ సినిమాను విడుదల తేదీనే త్వరలోనే వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తుండగా... ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

Mari Selvaraj Fourth Movie Vaazhai Streaming Detail Here

అలాగే సూర్య ప్రధానం ఎడిటింగ్ బాధ్యతలు తీసుకోగా.. నాగవెంకట కుమార్ సౌండ్ పనులను చూసుకున్నారు. మరి త్వరలోనే నేరుగా ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు రెడీ అయిపోండి. ఎక్కడికీ వెళ్కుండా ఇంట్లోనే ఉండి ఫ్యామిలీతో కలిసి ఆ అద్భుతమైన సినిమా చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X