Ant Man 3 OTT: థియేటర్లలో రిలీజైన 'యాంట్ మ్యాన్ 3'.. అప్పుడే ఓటీటీలోకి.. ఎందులో? ఏరోజు అంటే?
హలీవుడ్ సినిమాటిక్ యూనివర్స్ మార్వెల్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మార్వెల్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఈ యూనివర్స్ లో ఫేజ్ 1, ఫేజ్ 2 అంటూ చిత్రాలను విడుదల చేశారు. ఇటీవల బ్లాక్ పాంథర్ 2, థోర్ 4, డాక్టర్ స్ట్రేంజ్ 2 వంటి సినిమాలు వచ్చి పర్వాలేదనిపించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన చిత్రం 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా' (Ant-Man and the Wasp: Quantumania, Ant Man 3). పాల్ రూడ్, ఎవాంజలిన్ లిల్లీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ కాగా అప్పుడే ఓటీటీ విడుదల తేది ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పురుడు పోసింది మార్వెల్..
సినిమాటిక్ యూనివర్స్, మల్టీవర్స్, ఫ్రాంచైజీ సినిమాలు అంటూ ఇటీవల కాలంలో సినిమా రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు. అయితే వీటన్నింటికి పురుడు పోసింది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. తర్వాత డిస్నీ సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఏకంగా 15 ఏళ్ల నుంచి సక్సెస్ ఫుల్ గా కథలు తీసుకొస్తోంది మార్వెల్ సంస్థ.

అంతగా కానీ వర్కౌట్..
ఈ మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన సినిమాలు యమ క్రేజ్ తెచ్చుకునేవి. కానీ గత కొంతకాలంగా మార్వెల్ కు పెద్దగా కలిసి రావడం లేదు. మార్వెల్ సినిమాలు, వెబ్ సిరీస్ లు అనుకున్నంతగా వర్కౌట్ కావట్లేదు. అందుకు విభిన్నమైన కారణాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన మరో మార్వెల్ సినిమానే 'యాంట్ మ్యాన్ 3'.

అభిమానులను ఆకట్టుకోలేని..
యాంట్ మ్యాన్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో 31వ చిత్రంగా వచ్చిన మూవీ 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా'. ఈ సినిమా శుక్రవారం అంటే ఫిబ్రవరి 17న చాలా గ్రాండ్ గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇండియాలో విడుదలైంది. అయితే ఈ సినిమా మార్వెల్ అండ్ యాంట్ మ్యాన్ అభిమానులను ఆకట్టుకోలేదని టాక్ వినిపిస్తోంది. ఇందులో విలన్ అయిన కాంగ్ పాత్ర బాగున్నప్పటికీ అంతకుముందు యాంట్ మ్యాన్ చిత్రాల్లో ఉన్న ఫన్ అండ్ ఎమోషన్ మిస్ అయినట్లు నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ క్రమంలో యాంట్ మ్యాన్ మూడో సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది.

45 రోజుల తర్వాత..
ఇక మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన సినిమాలు అన్నీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అవుతుంటాయి. ఓటీటీ వేదిక మారే అవకాశమే లేదు. కానీ ఈ సినిమా ఓటీటీ విడుదల తేదిని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇంతకుముందు మార్వెల్ సినిమాల ఓటీటీ రిలీజ్ ను బట్టి చూస్తే యాంట్ మ్యాన్ 3 నెలన్నరలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్వెల్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే సమయంలో దానికంటే ముందు వచ్చిన మూవీలను ఓటీటీలో విడుదల చేస్తుంటుంది. అలాగే థియేటర్లలో రిలీజైన 45 రోజుల తర్వాత ఓటీటీల ముందుకు తీసుకొస్తుంటుంది.

ఆరోజున రిలీజయ్యే ఛాన్స్..
ఈ క్రమంలో గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3 చిత్రాన్ని మే 5న విడుదల చేసేందుకు మార్వెల్ రంగం సిద్దం చేస్తోంది. అందువల్ల యాంట్ మ్యాన్ 3 ఏప్రిల్ 5న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు హాలీవుడ్ వర్గాల టాక్. ఇక యాంట్ మ్యాన్ టైటిల్ రోల్, స్కాట్ లాంగ్ గా పాల్ రూడ్ నటించాడు. హోప్ వాన్ డీన్, వాస్ప్ పాత్రలో ఎవాంజలీన్ లిల్లీ, విలన్ కాంగ్ ది కాంకరర్ పాత్రలో జోనాథన్ మేజర్స్ నటించి ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











