Eagle Movie OTT: 2 ఓటీటీల్లో ఒకేరోజు విడుదల కాబోతున్న ఈగల్.. ఎప్పుడో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా సినిమా ఈగల్. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఫుల్ లెంత్ మాస్ సినిమాతో వచ్చిన రవితేజకు ఈ సినిమా కాస్త నిరాశ కల్గించిందనే చెప్పాలి. దీంతో ఈ సినిమా నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతుంది. ఒక్క దాంట్లో మాత్రం కాదులెండి.. ఏకంగా రెండు ప్రముఖ ఓటీటీల్లో ఈ సినిమా సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది. అది కూడా ఒకేరోజు రాబోతుంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన సినిమానే ఈగల్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేసింది. అలాగే నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు Davzand సంగీతం అందించారు.

హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్దగా పెద్దగా వసూళ్లు రాబట్టకపోయినా... ఓటీటీలో అలరించేందుకు సిద్ధం అవుతుందో. మొన్నటి వరకూ ఈ సినిమా ఏ ఓటీటీ వేధికగా రాబోతుందనే దానిపై క్లారిటీ రాలేదు. కానీ తాజాగా వచ్చిన ప్రకటనలు చూస్తుంటే మాత్రం ఈ సినిమా రెండు ఓటీటీల్లో రాబోతున్నట్లు అర్థం అవుతుంది. ముఖ్యంగా ఒకే రోజు రెండు ఓటీటీల్లో ఈ చిత్రం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ వీన్ వేధికగా ఈ సినిమా రాబోతున్నట్లు రెండ్రోజుల క్రితమే సంస్థ పోస్టర్ విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది. ఇక ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా త్వరలోనే ఈగల్ సినిమా రాబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ మధ్య ఒకే ప్లాట్ ఫామ్ లో కాకుండా రెండు, మూడు ప్లాట్ ఫామ్లలలో సినిమాలు రావడం కామన్ అయిపోయింది. ఇలా రవితేజ కొత్త సినిమా ఈగల్... అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్ లో కూడా సందడి చేయనుంది.

ఈగల్ సినిమా థియేటర్లలో ఎక్కువగా సందడి చేయకపోవడంతో.. త్వరలోనే ముఖ్యంగా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా మార్చి 2వ తేదీన ఈ చిత్రం అటు అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్ లోనూ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చి సర్ ప్రైజ్ ఇస్తుందా.. లేక అఫీషియల్ గా విడుదల తేదీని ప్రకటిస్తారా అనేది.


Click it and Unblock the Notifications











