Matka OTT: వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా.. మట్కా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Matka OTT Update: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ మూవీ 'మట్కా'. ఈ మూవీ గురువారం (నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కాగా.. మట్కా మూవీ ఓటీటీ లో ఎప్పుడు రిలీజ్ కానున్నదనే ఆసక్తి నెలకొంది. వరుణ్ తేజ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)కి కొంతకాలంగా సరైన హిట్ పడటం లేదు. గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలైంటేన్ సినిమాలు డిజాస్టర్లు గా నిలువడంతో వరుణ్ తేజ్ ఇమేజ్ కు కాస్త దెబ్బ పడింది. ఈ సమయంలో రూట్ మార్చి ప్రయోగాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. తాజాగా 'మట్కా' సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తున్నారు. ఈ మూవీ రేపు గురువారం(నవంబర్ 14)న విడుదల అయింది.

వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్నారు వరుణ్ తేజ్. ప్రయోగాలు చేస్తున్న, డిఫరెంట్ కంటెంట్ మూవీ చేస్తున్న సక్సెస్ ను అందుకోలేకపోతున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలని రతన్ ఖేత్రి అనే మట్కా గ్యాంగ్ స్టర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మట్కా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. నోరా ఫతేహి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
మట్కా మూవీ కథ విషయాని వస్తే.. 1950 నుంచి 1980 మధ్య కాలంలో నడిచిన స్టోరీగా మట్కాను తెరకెక్కించారు. మూవీలో వరుణ్ తేజ్ వాసు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. కటిక పేదరికంలో పుట్టిన వాసు.. మట్కా గ్యాంబ్లింగ్ తో ఎలా కోటీశ్వరుడు అవుతాడన్నది ఈ సినిమా కథ. వాసు చిన్నతనంలో శరణార్థగా తన తల్లితో కలిసి వైజాగ్ చేరుకుంటారు. ఈ సమయంలో చేయని తప్పుకు జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత ఎలాగైనా డబ్బు సంపాదించాలని మట్కా గేమ్ బిజినెస్ లో అడుగు పెడతాడు. అక్రమంగా మట్కా కింగ్ గా ఎదుగుతాడు.ఈ తరుణంలో అతడు ఎదుర్కొంటున్న పరిణామాలు ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మట్కా.

మక్కా ఓటీటీ (Matka OTT) స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన 'మట్కా' మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ గ్యాంగ్ స్టార్ మూవీ .. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడన్న ఆసక్తి నెలకొంది. ఇన్ పుట్స్ ప్రకారం.. మట్కా మూవీ డిసెంబర్ మూడో వారంలో ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశముంది. ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకి మిక్స్ డ్ టాక్ అందుకుంటుంది. మౌత్ పబ్లిక్ సిటీ పాజిటివ్ గా ఉంటే.. కలెక్షన్లు పెరిగితే.. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ మారవచ్చు. ప్లాప్ టాక్ వస్తే.. అంతకుముందుగానే ఓటీటీలో అడుగుపెట్టవచ్చు. అధికారిక ప్రకటన వచ్చేవరకూ చెప్పలేం.


Click it and Unblock the Notifications











