OTTలోకి 9 అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు సాధించిన తెలుగు మూవీ .. ఎక్కడ చూడాలో తెలుసా?

ఓటీటీ వాడకం పెరిగాక ఓటీటీ సంస్థలు సైతం ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల చేస్తున్నాయి. కొన్ని డైరెక్ట్ గా వస్తే... మరికొన్ని థియేటర్లలో విడుదల తర్వాత వస్తుంటాయి. రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన మట్టి కథ అనే సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమాకు 9 అంతర్థాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు లభించాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరోసారి చిన్న కథకు పట్టం కట్టారు : కంటెంట్ బాగుంటే మన తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను అందలం ఎక్కిస్తారనే విషయం తెలిసిందే. చిన్న సినిమా అయినా.. కథ నచ్చితే... బ్రహ్మరథం పట్టిస్తారు. అంతే కాదు.. అది ఏ హీరో నటించాడు.. ఏ డైరెక్టర్ తీశాడు అనే విషయాలు చూడరు. కథ నచ్చిందా.. ఆకట్టుకుంటుందా అనేది ముఖ్యం. ఇటీవల మట్టి కథ సినిమా.. థియేటర్లోకి వచ్చి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. అచ్చమైన పల్లె సినిమాగా మట్టికథ రూపొందింది.

Mattikatha movie won 9 international film festival awards Going To Streaming on Aha From October 13th
బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది : మట్టికథ సినిమా మనసును హత్తుకునే కథంశంతో తెరకెక్కింది. ఈ సినిమా చూసిన ఆడియెన్స్.. తమ మనసుల్ని కలిచేవేసే చిత్రమని చెప్పుకువచ్చారు. మరి తెలంగాణ సృంస్కృతి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా మట్టి కథ కూడా ఆ కోవలోనే వచ్చి.. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.
Mattikatha movie won 9 international film festival awards Going To Streaming on Aha From October 13th

9 అంతర్జాతీయ అవార్డులు : ఇక ఈ సినిమా విడుదలకు ముందే ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఇండో - ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 9 అవార్డులను ఈ మట్టి కథ సినిమా గెలుచుకుని వాహ్ అనిపించింది. అయితే థియేటర్లలో పర్వాలేదనిపించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధం అయింది.

Mattikatha movie won 9 international film festival awards Going To Streaming on Aha From October 13th

ఆహ ఓటీటీ వేదికగా : ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహ వేదికగా మట్టి కథ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. అక్టోబర్ 13న ఈ సినిమా ఆహా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ సంస్కృతి, మానవ బంధాల పరిమళాన్ని, పల్లెల్లో ప్రజల జీవిన విధానాన్ని, భూమే ప్రాణంగా, వ్యవసాయమే జీవనాధారంగా బతికే ప్రజల భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించారు. తమకు కావాల్సిందీ స్టార్ క్యాస్ట్ కాదని.. స్టోరీలో కంటెంట్ ఉంటే చాలని ప్రేక్షకులు కూడా మరోసారి చాటిచెప్పారు.

Mattikatha movie won 9 international film festival awards Going To Streaming on Aha From October 13th

మట్టికథ... మనసును హత్తుకునే కథ : ఇక మట్టి కథ సినిమా విషయానికి వస్తే... పవన్ కడియాల దర్శకత్వం వహించారు. మైక్‌ మూవీస్‌ బ్యానర్ పై అప్పిరెడ్డి నిర్మతగా వ్యవహారించారు. సతీశ్ మంజీర సహనిర్మాతగా వ్యవహరించారు. స్మరణ్ సాయి అదిరిపోయే సంగీతం అందించారు. ఈ మూవీ మ్యూజిక్ మరో హైలెట్. మీరు కనుక బలగం వంటి ఓ పల్లెటూరి సినిమాను చూడాలి అనుకుంటే ఈ మట్టికథను ఓటీటీలో మిస్ అవ్వకండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X