OTT ఈ వారం రాబోయే సినిమాలు ఇవే.. డిజాస్టర్ ఏజెంట్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రస్తుతం డిజిటల్ స్పేస్ కూడా కావాల్సినంత వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తోంది. ప్రతివారం సినిమాలు ఎలా అయితే రిలీజ్ అవుతున్నాయో అలాగే ఒటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు పదుల సంఖ్యలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఈ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వచ్చిన తర్వాత బిగ్ స్క్రీన్ పై సినిమాలు చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిందని చెప్పాలి.
బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తేనే తప్ప మూవీని థియేటర్స్ లో ఆడియన్స్ చూడటానికి ఇష్టపడటం లేదు. ఒకప్పుడు ఎవరేజ్ టాక్ వచ్చిన బ్రేక్ ఎవెన్ టార్గెట్ ని అందుకునే కలెక్షన్స్ వస్తూ ఉండేవి. అయితే ఇప్పుడు కేవలం సూపర్ హిట్ అనే టాక్ తప్ప ఇంకేదీ కూడా సినిమాని సేవ్ చేయడం లేదు. డివైడ్, ఎవరేజ్ టాక్ వచ్చింది అంటే నిర్మాతలు ఇక ఎంత నష్టం వస్తుందనేది లెక్కలు పెట్టుకోవాల్సిందే. దీనికి కారణం ఒటీటీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి.

ప్రతివారం ఒటీటీలో పదుల సంఖ్యలు వెబ్ సిరీస్ లు, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఈ వారం ఒటీటీ ప్రేక్షకులని అలరించడానికి వస్తోన్నవేంటి అనేది చూసుకుంటే..
ముందుగా నెట్ ఫ్లిక్స్ లో.. 'మెక్ గ్రెగర్ ఫరేవర్' అనే ఇంగ్లీష్ సిరీస్ మే 17 స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక 'ఎస్ఓ, కిట్టీ ఇంగ్లీష్' సిరీస్ మే 18 రిలీజ్ అవ్వనుంది. హిందీ మూవీ కతల్ మే 19 టెలికాస్ట్ అవ్వనుంది. తమిళ్ వెబ్ సిరీస్ 'నామ్ సీజన్ 2' మే 19న రిలీజ్ అవుతోంది. మలయాళీ మూవీ 'అయల్ వాసి' మే 19 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.
అమెజాన్ ప్రైమ్ లో వచ్చే కంటెంట్ చూసుకుంటే.. మోడ్రన్ లవ్: చెన్నై అనే తమిళ వెబ్ సిరీస్ మే 18 నుంచి ప్రసారం కానుంది. ఇక ఆహా లో మారుతీనగర్ పోలీస్ స్టేషన్ అనే తమిళ సినిమా మే 19 రిలీజ్ కాబోతోంది. సోనీ లివ్ లో రీసెంట్ డిజాస్టర్ మూవీ అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ మే 19న స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇటీవల కాలంలో అత్యధిక వేగంగా థియేట్రికల్ నుంచి ఓటీటీలోకి వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక కదిన కదొరమీ అంనడకహం మలయాళ మూవీ మే 19 రిలీజ్ అవ్వబోతుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూసుకుంటే.. 'యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటుమేనియా' తెలుగు డబ్బింగ్ మూవీ మే 17 నుంచి అందుబాటులోకి వస్తోంది. నిహారిక లీడ్ రోల్ లో నటిస్తూ నిర్మిస్తోన్న 'డెడ్ పిక్సెల్స్' తెలుగు సిరీస్ మే 19న రిలీజ్ కానుంది. మలయాళీ మూవీ 'పూక్కాలమ్' మే 19న స్ట్రీమింగ్ కాబోతుంది. ఇలా ఈ వారం ఒటీటీలో డిఫరెంట్ లాంగ్వేజెస్ సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవ్వనున్నాయి. వీటిలో అఖిల్ ఏజెంట్ మూవీ కాస్తా హై బడ్జెట్ తో, ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతోంది. అలాగే నిహారిక డెడ్ ఫిక్సల్స్ పైన కూడా కొంత బజ్ ఉంది.


Click it and Unblock the Notifications











