Mazaka OTT : ఓటీటీలో మజాకా సంచలనం .. రేర్ ఫీట్ కొట్టిన సందీప్ కిషన్

ఓటీటీల రంగ ప్రవేశంతో ప్రేక్షకులు సినిమాను చూసే విధానం పూర్తిగా మారిపోయింది. వారు ఏ సినిమాను ఆదరిస్తారో? ఏ సినిమాను తిరస్కరిస్తారో అర్ధం కావడం కాక సినీ పరిశ్రమలో విచిత్రాలు జరుగుతుంటాయి. థియేటర్‌లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలలో బొక్కబొర్లాపడుతుంటాయి. ఇక వెండితెరపై భారీ నష్టాలను తీసుకొచ్చిన సినిమాలు ఓటీటీలలో సరికొత్త రికార్డులతో ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఇలాంటి ఉదంతాలు ఎన్నో జరిగాయి. ఈ కోవలోకే వస్తుంది మజాకా.

యంగ్ హీరో సందీప్ కిషన్ సందీప్ కిషన్ , రీతూ వర్మ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మజాకా. రావు రమేశ్, అన్షు అంబానీలు కీలకపాత్రలు పోషించారు. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్‌లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో బాగానే సందడి చేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఓటీటీలోకి వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇక్కడ మాత్రం దుమ్ములేపుతోంది. తాజాగా సందీప్ కిషన్ చిత్రం ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

Mazaka Movie Creates New Record in OTT here is the details

ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇక అప్పెడెప్పుడో నాగార్జునతో మన్మథుడు సహా కొన్ని తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్‌కు దూరమైన అన్షు అంబానీ దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటించడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రీ రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాథరావు .. అన్షుపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపి మహిళా కమీషన్ వరకు వెళ్లి ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది.

తండ్రీకొడుకులు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం , ఈ మధ్యలో చోటు చేసుకునే పరిస్ధితులను చూపెడుతూ మజాకాను తెరకెక్కించారు. త్రినాథరావు గత సినిమాల ట్రాక్ రికార్డు, సందీప్ కిషన్ ఫాలోయింగ్‌ నేపథ్యంలో మజాకా చిత్రానికి రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు రూ. 12 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు.

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే .. తొలి రెండు రోజు ఫర్వాలేదనిపించినా లాంగ్ రన్‌లో మజాకా ఆకట్టుకోలేకపోయింది. వారం రోజుల్లో థియేట్రికల్ రన్ ముగించిన మజాకా ప్రపంచవ్యాప్తంగా రూ.11.5 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఇండియాలో రూ.9 కోట్ల నెట్.. రూ.10.5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో కోటి రూపాయల గ్రాస్‌‌తో కలిపి మొత్తంగా రూ.11.5 కోట్ల వసూళ్లతో క్లోజ్ చేసింది. దాదాపు రూ. 50 లక్షల నష్టంతో మజాకా పరుగు ముగిసింది.

దీంతో ఈ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. మజాకా డిజిటల్ రైట్స్‌ను జీ 5 సంస్థ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోగా.. ఉగాది కానుకగా మార్చి 28 నుంచి స్ట్రీమింగ్‌లోకి అందుబాటులో ఉంచింది. అయితే ఓటీటీలో మాత్రం మజాకా దుమ్మురేపుతోంది. ఏకంగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను అందుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మేరకు జీ 5 సంస్థ అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీంతో రాబోయే రోజుల్లో మజాకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: mazaka sundeep kishan ritu varma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X