OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్​ ఫన్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్.. ఎక్కడ చూడాలంటే?

వీకెండ్ వచ్చేసింది. శుక్రవారం రావడంతో వివిధ భాషల్లోని పలు సినిమాలు, వెబ్‌ సిరీస్​లు థియేటర్లు, ఓటీటీలోకి వచ్చేశాయి. ఇందులో సూపర్ హిట్ అయినవి కూడా ఉన్నాయి. మరి కొన్ని ఎలాంటి అనౌన్స్​మెంట్​ లేకుండా సైలెంట్​గా వచ్చేసి మంచి రెస్పాన్స్​తో స్ట్రీమింగ్​ అవుతున్నాయి. అలా ఇప్పుడు ఈ వీకెండ్​ స్పెషల్​గా ఓటీటీలోకి ఓ సూపర్ హిట్ ఫన్ అంట్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ వచ్చేసింది. మరి ఆ చిత్రం ఎందులో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం..

హీరోయిన్​గా గుంటూరు కారం బ్యూటీ :
వీకెండ్​ రావడంతో ఎప్పటిలాగే కొత్త సినిమా సిరీస్​లు వచ్చి మూవీ లవర్స్​ను సర్​ప్రైజ్ చేశాయి. వీటిలో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్​గా ఓటీటీలోకి వచ్చేసిన సినిమాల్లో సింగపూర్ సెలూన్ ఒకటి. ఈ చిత్రంలో టాలీవుడ్ హాట్ బ్యూటీ, గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి నటించడం విశేషం. ప్రస్తుతం ఈ భామ ఫుల్ ఫామ్​లో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్​ మీడియాలో భారీ అందాలను ప్రదర్శిస్తూ అలాగే వరుసగా స్టార్ హీరోల సినిమాల ఆఫర్ల అందుకుంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Meenakshi Chaudhary Family Entertainer Singapore Saloon Movie Streaming Now Amazon Prime Video OTT See Details Here

గెస్ట్​ రోల్స్​లో ముగ్గురు స్టార్స్​ :
అలానే కోలీవుడ్​లో సింగపూర్ సెలూన్​ ఆఫర్​ను దక్కించుకుని అందులో హీరోయిన్​గా నటించింది. గోకుల్‌ దర్శకత్వం వహించారు. దర్శకుడు, నటుడు ఆర్‌జే బాలాజీ, బాహుబలి కట్టప్ప సత్యరాజ్​, లాల్ ఇతర​ ప్రధాన పాత్రలు పోషించారు. కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్ క‌న‌గ‌రాజ్ గెస్ట్ రోల్‌లో క‌నిపించి ఆకట్టుకున్నారు. ఆయనతో పాటు గ్లామర్ హీరో అర‌వింద్ స్వామి, యాత్ర 2 హీరో జీవా కూడా అతిథి పాత్ర‌ల్లో మెరిశారు.

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు :
అలా ఫన్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్​గా రూపొందిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 25న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైంది. ఆ తర్వాత బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్​గా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లను అందుకుంది. సినిమాకు పాజిటివ్ టాక్‌ రావడం వల్ల తెలుగులోనూ డబ్‌ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అది కూదరలేదు.

Meenakshi Chaudhary Family Entertainer Singapore Saloon Movie Streaming Now Amazon Prime Video OTT See Details Here

అనౌన్స్​మెంట్ లేకుండానే :
ఇప్పుడేమో ఈ సింగపూర్ సెలూన్ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్​కు అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ హక్కులను దక్కించుకుని స్ట్రీమింగ్​కు వదిలింది. ఎలాంటి ముందస్తు అనౌన్స్​మెంట్ లేకుండానే శుక్రవారం (ఫిబ్రవరి 23) అర్ధ రాత్రి నుంచి అందుబాటులో ఉంచింది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు డబ్బింగ్​ వెర్షన్​ను కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమా కథ ఏంటంటే? :
సూపర్​ హెయిర్ స్టైలిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించాలని, తన వ్యాపారాన్ని విస్తరించాలని కలలు కంటూ ఓ సెలూన్​ షాప్​ను నడుపుతుంటాడు హీరో ఆర్జే బాలాజీ. మరి బీటెక్ చదివిన అతడు అసలు ఎందుకీ సెలూన్ వృత్తిని తన ప్రొఫెషన్​గా ఎంచుకున్నాడు? తన కలను సాకారం చేసుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? హై క్లాస్​ అయిన మీనాక్షి చౌదరి అతడిని ఎందుకు ప్రేమించింది? అనే ప్రశ్నలతో ఎమోషన్స్, కామెడీ ఎలిమెంట్స్​తో సాగుతుందీ సింగపూర్ సెలూన్ కథ. ఈ వీకెండ్​లో ఎంచక్కా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X