Niharika Kondiela: సినిమాల్లోకి నిహారిక రీ ఎంట్రీ.. యువతను టార్గెట్ చేసేలా వెబ్ సిరీస్!
చిత్ర పరిశ్రమలోకి స్టార్ల వారసులు ఎంట్రీ ఇవ్వడం సాధారణ విషయమే. అలా టాలీవుడ్ లో ఎంతో మంది తరెంగేట్రం చేశారు. అలా వచ్చిన వారిలో కొందరు మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగా డాటర్ నిహారిక గురించి.
చాలా కాలం క్రితమే తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి తెరపై సందడి చేయనుంది. అయితే ఈసారి డిజిటల్ తెరపై అలరించేందుకు ఓ వెబ్ సిరీసుతో రంగంలోకి దిగింది.

ఆరంభంలో అలా: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా 'ఢీ' అనే డ్యాన్స్ షోతో యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల. అందులో మెప్పించిన గ్లామరస్ బ్యూటి ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లనూ చేసింది. ఈ క్రమంలోనే 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించడంతో పాటు నటించింది. అలా కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకుంది.

టీజర్ రిలీజ్: ఇక 2016లో వచ్చిన ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై తెరంగేట్రం చేసిన నిహారిక కొణిదెలకు కెరీర్ పరంగా వర్కౌట్ కాలేదు. సినిమాలకు బ్రేక్ ఇచ్చి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న నిహారిక అదే కంటిన్యూ చేసింది. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత డిజిటల్ ఫ్లాట్ ఫామ్ తో మళ్లీ యాక్టింగ్ లోకి ఏంట్రీ ఇచ్చింది. ఆమె తాజాగా నటించిన వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్. ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేశారు.

బానిసలుగా మారిన: డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీసులో నిహారిక కొణిదెల గేమర్ గా కనువిందు చేయనుంది. ఈ టీజర్ లో నలుగురు స్నేహితులు ఓ వీడియో గేమ్ లోకి అడుగుపెడతారు. అనుకోని కారణాలతో అందులో ఇరుక్కుపోతారు. దాని నుంచి బయటకు రాలేరు. ఇంతకీ ఆ గేమ్ ఏంటీ.. వీడియో గేమ్స్ కు బానిసలుగా మారిన నేటి యువత ఎదుర్కొంటున్న పర్యవసానాలు ఏంటీ అనే విషయాలను డెడ్ పిక్సెల్స్ సిరీసులో చూపించే ప్రయత్నం చేశారు.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?: మే 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీసులో నిహారిక కొణిదెలతోపాటు హీరో సాయి రోనాక్, వైవా హర్ష, అక్షయ్ లాగుసాని, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ తదితరులు నటించారు. ఆదిత్య మందల దర్శకత్వం వహించిన ఈ సిరీసుకు సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందించారు.
సంయుక్తంగా: డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీసుకు కథ, స్క్రీన్ ప్లేను అక్షయ్ పొల్ల అందించారు. బీబీసీ స్టూడియోస్ ఇండియా, తమడ మీడియా సంయుక్తంగా నిర్మించారు. నిరంతరం గేమ్స్ తోనే టైమ్ గడిపే యువతను టార్గెట్ గా ఈ సిరీసును రూపొందించినట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











