Aha OTT: అలా చేసుంటే ఆహాకు లాస్ట్ అయ్యుండేది... నిహారిక షాకింగ్ కామెంట్స్ వైరల్

ప్రముఖ ఆహా ఓటీటీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ ఓటీటీని అల్లు అరవింద్ స్థాపించి.. తెలుగు కంటెంట్ అందిస్తూ సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఓటీటీలో ఎన్నో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి చెఫ్ మంత్రా. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో... ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తోంది. దీనికి హోస్టుగా మెగా డాటర్ నిహారిక కొణిదెల ఉండగా.. తాజాగా చెఫ్ మంత్రా సీజన్ 3 తాజా ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

తెలుగు కంటెంట్ అందించే ఆహా ఓటీటీ గురించి అందరికి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది ఇది. అయితే ఇందులో ఎన్నో కార్యక్రమాలు, సినిమాలు ఉంటాయి. అందులో ఒకటి చెఫ్ మంత్రా. ఇప్పటికే ఈ షో రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కు మంచు లక్ష్మి హోస్టుగా రాగా... ఆ తర్వాత సీజన్ యాంకర్ శ్రీముఖు హోస్టుగా చేసింది. ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తుంది. ఈ సీజన్ కు హోస్టుగా మెగా డాటర్ నిహారిక చేస్తోంది.

Mega Daughter Niharika Konidela Shocking Comments on Aha OTT in Chef Mantra Season 3 Show

ఇప్పటికే ఐదు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీజన్... తాజాగా ఆరవ ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఈ ఆరవ ఎపిసోడ్ ఉగాది కానుకగా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆరవ ఎపిసోడ్ కు గెస్టులుగా ప్రముఖ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, హేమచంద్ర వచ్చారు. వచ్చి సందడి చేశారు. నిహారికతో కలిసి కాస్త ఫన్ పుట్టించేందుకు ట్రై చేశారు. ఇక ఈ షోపై మొదటి నుంచి నెగిటివిటీ వస్తుంది. దానికి కారణం డ్యాష్ పేరుతో బూతు క్వశ్యన్స్ అడుగుతున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక తాజాగా విడుదల అయిన ప్రోమోలో రాహుల్ సింప్లిగంజ్, హేమచంద్ర, నిహారిక కలిసి పెద్దపులి పాటకు చిందులు వేశారు. ఆ తర్వాత పంచాంగం చూసుకోవా అంటూ నిహారిక రాహుల్ ని అడగ్గా... చూసుకోవాల్సిన అవసరంలేదు.. అంతా బాగానే జరుగుతుందని కౌంటర్ వేస్తాడు. ఇక హేమచంద్రను రాసులు ఉంటాయి కదా అని నిహారికను అనగా.. ఎలాగూ రాసి ఉన్నదేజరుగుద్ది రాసులు ఎందుకు అంటూ సెటైర్ వేస్తాడు హేమచంద్ర.

ఇక పాట పాడమని రాహుల్, హేమచంద్ర.. నిహారికను అడిగితే.. అలా చేస్తే.. ఆహాకు ఇదే చివరి ఎపిసోడ్ అవుతుందని కామెంట్ చేయడం కాస్త ఫన్ కలిగించింది. ఇక యాదమ్మరాజు వచ్చి తాను అప్జల్ గంజ్ అంటూ పరిచయం చేసుకోవడం.. కాస్త ఫన్ కలిగించే ప్రయత్నం చేశారు. ఇక డ్యాష్ క్వశ్చన్స్ ఇచ్చి నవ్వులు పూయించారు. రాహుల్, హేమచంద్ర కలిసి వంట చేస్తారు. వారు వండిన వంట చూసి... రాహుల్ నీకు ఇంత బాగా వంట వచ్చా.. ఈవిషయం తెలిస్తే.. రేపటి నుంచి అమ్మాయిలు మీ ఇంటి ముందు క్యూ కడతారు అంటూ అంటుంది.

దీంతో రాహుల్ ఎందుకు వంటచేసిపెట్టమనా అంటూ సెటైర్ వేస్తారు. ఇక ఈ ప్రోమో కాస్త నవ్వులు పూయించింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉగాది కానుకగా స్ట్రీమింగ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X