OTT: థియేటర్‌లో డిజాస్టర్ .. ఓటీటీలోకి దిగిన వరుణ్ తేజ్ మట్కా, ఎందులో అంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో అనేకమంది హీరోలు కనిపిస్తారు. అయితే ఇపుడు ఉన్న జెనరేషన్ లో ఈ హీరోస్ అంతా కూడా దాదాపు ఏదొక కుటుంబానికి చెందినవారే అయ్యుంటారని చెప్పాలి. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన వారు అయితే చాలా తక్కువ మంది ఉంటారని చెప్పాలి. అలా పలు కుటుంబాల విషయానికి వస్తే టాలీవుడ్‌లో అత్యధిక హీరోస్ ఉన్నది మాత్రం మెగా కుటుంబం నుంచే అని చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి నిర్మించిన సామ్రాజ్యం నుంచి ఇపుడు చాలా మంది హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకడు. కాగా వరుణ్ తన గ్లామర్ అండ్ లుక్స్ తో తన డెబ్యూ సినిమాకే అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే కుటుంబంలో ఇతర హీరోల్లా కాకుండా వరుణ్ తేజ్ కొత్త దారి ఎంచుకున్నాడు. రీమేక్ లాంటివి చేయకుండా కొత్త కొత్త సబ్జెక్టులు ఎంచుకోవడం స్టార్ట్ చేసాడు.

అయినప్పటికీ తనకి మాత్రం సరైన విజయం చాలా కాలం నుంచి లేదు. ఇలా వరుస డిజాస్టర్స్ నడుస్తున్న సమయంలోనే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాని చేసాడు. ఆ చిత్రమే "మట్కా". పాన్ ఇండియా హంగులతో , భారీ బడ్జెట్, బాలీవుడ్ స్టార్స్ లాటి వారితో చేసిన ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.
కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో ఘోరంగా విఫలం అయ్యింది. దాదాపు రూ. 40 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం మినిమమ్ రూ.3 కోట్ల షేర్ ని కూడా రాబట్టలేకపోవడం షాకింగ్ అని చెప్పాలి. దీనితో ఈ ఏడాదిలో భారీ నష్టాలు ఇచ్చిన సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోగా ఇపుడు నెల తిరక్కుండానే ఓటిటి రిలీజ్ కి రెడీ అయ్యిపోయింది.

నవంబర్ 14న సినిమా రిలీజ్ కి వస్తే కేవలం మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేస్తుండడం గమనార్హం. అన్నట్టు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా వచ్చేస్తున్నట్టుగా వారు అనౌన్స్ చేసేసారు. తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ , మలయాళ భాషల్లో తీసుకొస్తున్నట్టుగా ఇపుడు స్ట్రీమింగ్ డేట్ ఇచ్చేసారు.
మంచి పొటెన్షియల్ సబ్జెక్టు అయినప్పటికీ ఈ చిత్రం ఆవిష్కరించడంలో జరిగిన తప్పులకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. హై బడ్జెట్ పీరియాడిక్ సినిమాగా ఈ సినిమాని "హాయ్ నాన్న" సినిమా నిర్మాతలు తెరకెక్కించారు. కానీ ఫైనల్ గా మాత్రం సినిమా డిజాస్టర్ గానే నిలిచిపోయింది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఈ సినిమాలో కీలక పాత్ర చేసింది. మరి ఓటిటిలో వచ్చాక అయినా మట్కా ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











