OTTలోకి వచ్చేసిన హాలీవుడ్ రేంజ్ తెలుగు యాక్షన్ డ్రామా.. ఎక్కడ చూడాలంటే?
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్. ఆయన మెగా కంపౌండ్ నుంచి వచ్చినా... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని... సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక ఆయన నటించిన తాజా చిత్రం గాండీవరిధారి అర్హున. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దకు వచ్చి పరాజయం పాలైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలో ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్ర స్ట్రీమింగ్ డిటైయిల్స్ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముకుంద సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో.. ఆ తర్వాత వైవిధ్యపరమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఈ హీరోకు గత కొంత కాలంగా బాక్సాఫీస్ వద్ద కలిసి రావడం లేదు. గని చిత్రంతో పరాజయం చవిచూసిన ఈ హీరో... ఆయన తాజాగా నటించిన గాండీవదారి అర్జున చిత్రంతో మరో పరాజయం చవిచూశాడు.

గత కొంతకాలంగా హిట్లు లేక సతమతవుతున్న వరుణ్ తేజ్... ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో 'గాండీవధారి అర్జున' అనే సినిమాను చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. ఇక ట్రైలర్స్ చూసి అంతా హాలీవుడ్ రేంజ్ మూవీ అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే యాక్షన్ సీక్వెన్స్ తో సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ యాక్షన్స్ సీక్వెన్స్ చూసి అంతా హాలీవుడ్ మూవీలా ఉందని భావించారు.
ఇక గాండీవధారి అర్జున మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అలాంటి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే రిలీజ్ అయిన తర్వాత వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ నుంచి ఆశించినస్థాయి రిజల్ట్ రాలేదు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన 'గాండీవధారి అర్జున' మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మంచి వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నా ఈ మూవీ ఫుల్ రన్‌లో వరల్డ్ వైడ్‌గా రెండు కోట్ల రూపాయల షేర్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఈ సినిమా ఏకంగా రూ. 16 కోట్లకు పైగానే నష్టాలను మిగిల్చింది. దీంతో వరుణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది.

థియేటర్లలో నిరాశ పరిచిన వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సెప్టెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఇందులో థియేటర్ వెర్షన్ కాకుండా కొన్ని సీన్స్ కలిపి, కొన్నింటినీ తీసేసి మరీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 'గాండీవధారి అర్జున' మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. నాజర్, విమలా రామన్, వినయ్ రాజ్, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











