Godfather సినిమా ఓటీటీ రైట్స్.. భారీ ధరకు కొనుగోలు చేసిన బడా సంస్థ!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాపై మెగా అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలెంటెడ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లతో టీజర్ తో అభిమానుల్లో పాజిటివ్ సైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ కొంత అసంతృప్తి చెందినప్పటికీ కూడా తప్పకుండా మంచి కంటెంట్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినిమాను రూపొందించినట్లుగా చిత్ర యూనిట్ నమ్మకంతో చెబుతోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా దాదాపు క్లోజ్ అయినట్లు సమాచారం. గాడ్ ఫాదర్ సినిమాను దసరా ఫెస్టివల్ కు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటిటి హక్కులకు సంబంధించిన డీల్ కూడా క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమా రైట్స్ కోసం బాగానే పోటీ పడినట్లు సమాచారం. ముఖ్యంగా హాట్ స్టార్ కూడా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకునెందుకు భారీ స్థాయిలో ఒక ఆఫర్ కూడా చేసినట్లు ఆమధ్య టాక్ వచ్చింది.

Megastar chiranjeevi godfather movie ott deal update

అయితే ఇప్పుడు ఊహించిన విధంగా మరో ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. రైట్స్ ఎంత అమ్ముడుపోయాయి అనే విషయంలో క్లారిటీ రాలేదు కానీ మెగాస్టార్ కెరీర్లో లోనే ఈ సినిమా మంచి రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన విడుదల తేదీ విషయంలో కూడా కొన్ని రూమర్స్ అయితే అభిమానులను కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నాయి. సినిమా దసరా నుంచి వాయిదా పడే అవకాశం ఉంది అని కూడా కథనాలు విలువడ్డాయి. కానీ అందులో కూడా నిజం లేదు అని సినిమా అనుకున్నట్లుగానే అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్ విడుదల కాబోతున్నట్లు వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X