Godfather OTT Release: మెగాస్టార్ గాడ్ ఫాథర్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎందులో అంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ కూడా పూర్తిస్థాయిలో అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేయలేకపోయింది. అయితే మెగా అభిమానులకు మాత్రం చిరంజీవి నటించిన విధానం ఎంతగానో కనెక్ట్ అయింది. అందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించడం కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. నిర్మాతలకు మాత్రం పెద్దగా నష్టాలు కలగలేదు కానీ పలు ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినట్లుగా తెలుస్తోంది. అయితే గాడ్ ఫాదర్ సినిమాను ఓటీటీలో కూడా విడుదల చేస్తారు అనే విషయంలోనే కరకాల రూమర్స్ అయితే ఇటీవల వైరల్ అయ్యాయి. ముఖ్యంగా గత వారమే ఈ సినిమా ఓటీటీలో వచ్చే అవకాశం ఉందని సినిమా విడుదల సమయంలో చాలా వార్తలు వచ్చాయి.

కానీ ఆ విషయంలో ఎలాంటి నిజం లేదు అని చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఇప్పుడు మొత్తానికి అనుకున్న డేట్ ప్రకారం గాడ్ ఫాదర్ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నేట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక నవంబర్ మొదటి వారంలో రావచ్చు అని కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు వాటిలో కూడా నిజం లేదు అని ఈ సినిమా నవంబర్ 15వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది.
త్వరలోనే విషయంపై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఓటీటీలో ప్రతిసారి కూడా రికార్డు స్థాయిలోనే వ్యూవ్స్ అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాను కూడా ఓటీటీలో చూడాలి అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ రూట్లో సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఇక మరొకవైపు మెగాస్టార్ చిరంజీవి వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా రాబోతుంది. ఇక ఆ తరువాత భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











