OTT: మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ప్లాన్.. సరికొత్తగా పవర్ఫుల్ కంటెంట్ వెబ్ సీరీస్?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆసక్తికరమైన మాస్ యాక్షన్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఆచార్య డిజాస్టర్ అనంతరం ఎలాగైనా మరొక సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అనే మెగాస్టార్ చిరంజీవి ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి కొన్ని ఓటీటీ ఆఫర్స్ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. కొన్ని ప్రముఖ సంస్థలు ఆయనతో వెబ్ సీరీస్ చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి కంటెంట్ కావాలి అనే విషయంలో కూడా సలహాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Recommended Video


ఆచార్యతో నష్టాలు
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా అనంతరం చాలా గ్యాప్ తీసుకుని విడుదల చేసిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించాడు. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దారుణమైన నష్టాలను కూడా కలుగజేసింది. దీంతో మెగాస్టార్ నష్టాల బారిన పడిన వారికి కూడా అండగా నిలిచినట్లు తెలుస్తోంది.

గాడ్ ఫాదర్
అయితే ఆచార్య తరహాలో మళ్లీ అపజయం ఎదురవకూడదని మెగాస్టార్ ప్రస్తుతం లైన్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ప్రతి ఒక అప్డేట్ జనాల్లోకి వెళ్లాలి అని ప్రమోషన్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

ఓటీటీ ఆఫర్స్
అయితే ఒక వైపు సినిమాలు చేస్తున్న మెగాస్టార్ మరొకవైపు ఓటీటీ లోకి కూడా అడుగు పెట్టాలి అని చూస్తున్నారు ఎప్పటినుంచో ఆయనకు ఇలాంటి ఆఫర్స్ వస్తున్నప్పటికీ కూడా అటువైపు పెద్దగా ఫోకస్ చేసింది లేదు. కానీ ఓటీటీ లో ఎక్కువగా డిఫరెంట్ కంటెంట్ కు మంచి స్పందన లభిస్తుంది అని అటువైపు ప్రయోగాలు చేయాలి అని అనుకుంటున్నారు.

మెగాస్టార్ సలహా
ఇటీవల కొన్ని ఓటీటీ కంపెనీలు కూడా మెగాస్టార్ చిరంజీవి సంప్రదించినట్లు సమాచారం. వారి దగ్గర ఉన్న కొన్ని విభిన్నమైన కాన్సెప్ట్ ల గురించి కూడా చెప్పడం జరిగిందట. అయితే తన పబ్లిక్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచకుండా కొత్తగా ఆలోచించాలి అని ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా పవర్ ఫుల్ గా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే అందులో తాను నటించడానికి సిద్ధమని కూడా మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

స్క్రిప్ట్ వర్క్ లో..
ఇటీవల ఒక ప్రముఖ ఓటిటి కంపెనీకి ఆయన వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నాడట. కానీ కంటెంట్ మాత్రం మెప్పించకపోవడంతో మరింత స్క్రిప్ట్ వర్క్ జరగాల్సిన అవసరం ఉంది అనే సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ గా వెండితెరపై సినిమాలు చేస్తూనే అలాగే ఓటిటిలో ప్రయోగాత్మకమైన సినిమాలను చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ రూట్ లో ఆయన ఎలాంటి క్రేజ్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











