OTTలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ... అలాంటి వెబ్ సిరీసుతోనే!
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు అంతా ఓటీటీలో సినిమాలు, సిరీసులు తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడానికి మంచి కథ కోసం చూస్తున్నట్లు ఇదివరకు వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఆయన ఓ వెబ్ సిరీసుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ఎలాంటి వెబ్ సిరీసుకు సైన్ చేశారు.. ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం.
కరోనా తర్వాత ఎక్కువగా అందరూ ఓటీటీవైపు మక్కువ చూపుతున్నారు. ఇప్పుడు థియేటర్ కు పోయి ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లు అంతా ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మన తెలుగులో ఇప్పటికే చాలా మంది ఓటీటీలో సినిమాలు, సిరీసులు చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి కూడా అదే రూటులో వెళ్లేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పుటికే మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీపై చాలా కథనాలు బయటకు వచ్చాయి. ఆయన మంచి కథ దొరికితే ఓటీటీలో మంచి సినిమా లేదా సిరీసు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార ఫేం వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న మెగా 156గా వస్తోన్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా ఫిక్స్ అయింది.
ఇక ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతికి 10వ తేదీన రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. అయితే ఇదిలా ఉంటే... మెగాస్టార్ చిరంజీవి గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. చిరంజీవి తొలిసారి ఓ వెబ్ సిరీస్ కు సంతకం చేశాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. గతంలో చెప్పినట్టుగానే మంచి స్క్రిప్ట్ దొరకడంతో ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో సందడి చేయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టు సమాచారం. దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్‌ను ఏలుతున్న చిరు మరి ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఎలాంటి ఇంప్రెషన్ చూపిస్తాడనేది ఆసక్తిగా మారింది. మరి చిరంజీవి సైన్ చేసిన వెబ్ సిరీస్ ఏ జోనర్ అనేది తెలియాల్సి ఉంది.

ఎక్కువగా థ్రిల్లర్ కాన్సెప్టు వెబ్ సిరీసులకు క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి కూడా అలాంటి వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు వస్తారని సమాచారం. ఈ వెబ్ సిరీస్ కు మెగాస్టార్ చిరంజీవి సైన్ చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే... యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్‌ఆర్‌ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











