OTT సీరియల్ కిల్లర్‌గా మారిన మెగాస్టార్ - నరాలు తెగే ఉత్కంఠతో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్!
అవును మీరు చదివిన టైటిల్ నిజమే! సీరియల్ కిల్లర్‌గా మారారు మెగాస్టార్. తన కొత్త సినిమాలో సీరియల్ కిల్లర్‌గా కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ పోషించారు. ట్విస్ట్‌లతో కూడిన క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిందీ చిత్రం. ఇప్పుడీ సినిమా ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయింది. మరి ఈ చిత్రం ఎందులో, ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్ కానుందో వివరాలు స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో పెద్ద స్టార్ డమ్ ఉన్న ఆయన అందరి హీరోల్లా కాకుండా కమర్షియల్ సినిమాలు చేయట్లేదు. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు. కంటెంట్ ఉన్న చిత్రాలకే ఓటు వేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రీసెంట్గా కూడా బ్లాక్ అండ్ వైట్ బ్రహ్మయుగం అనే చిత్రంతో థియేటర్లలోకి వచ్చి మంచి సక్సెస్‌ను అందుకున్నారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధించింది.

దీని కన్నా ముందు ఈ ఏడాది జనవరి 11న థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్ చిత్రంతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించారు మమ్ముట్టి. దాదాపు రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు మంచి రెస్పాన్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. అలా చిన్న సినిమాగా విడుదలై ఈ చిత్రం థియేటర్ ఆడియెన్స్‌ను బాగా మెప్పించింది. ఈ చిత్రంలో స్టార్ హీరైన మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నటించడం విశేషం. నెగెటివ్ షేడ్స్‌తో కనిపించారాయన.
మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కొన్నిసార్లు వాయిదా పడుతూ వచ్చింది. అలా ఫైనల్‌గా మార్చి 20న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. కేవలం మలయాళంలోనే కాదు ఇతర అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ అవ్వనుందని సమాచారం అందింది. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ జయరాం కూడా హీరోగా నటించారు. ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఎలాంటి థ్రిల్ ఇస్తుందో చూడాలి మరి. ఈ చిత్రంలో ఆయన ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించి ప్రశంసలు అందుకున్నారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి.

అబ్రహం ఓజ్లర్ కథేంటంటే? అబ్రహం ఓజ్లర్ (జయరాం) ఓ పోలీస్ అధికారి. అయితే అతడి భార్యా పిల్లలు అనుకోకుండా మిస్ అవుతారు. వారు కనిపించకుండా పోయినప్పటి నుంచి తన పక్కనే ఉన్నట్లుగా ఓజ్లర్ ఊహించుకుంటూ గడిపేస్తుంటాడు. అయితే అదే సమయంలో వరుసగా భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు హత్యలకు గురౌతుంటారు. వారి శవాల దగ్గర హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్స్ దొరుకుంటాయి. మరి ఆ హత్యల కేసును పోలీస్ ఆఫీసర్ అయిన ఓజ్లర్ ఎలా ఛేదించాడు? మరోవైపు అసలు అలెక్స్ (హీరో మమ్ముట్టి) సీరియల్ కిల్లర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అతడు ప్రేమించిన సుజా అనే అమ్మాయి మరణానికి కారణం ఏమిటి? అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. చిత్రానికి మిదున్ థామస్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











