OTT: నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డ్స్ బ్రేక్ చేసిన మైక్ టైసన్ .. తన లైవ్ ఫైట్‌కి రికార్డు వ్యూస్..
వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎన్నో మోస్ట్ పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్ ని నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. మరి వరల్డ్ వైడ్ గా వందల కోట్లమంది వినియోగదారుల కోసం నెట్ ఫ్లిక్స్ సాలిడ్ కంటెంట్ ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తుంది. కాగా ఈ నెట్ ఫ్లిక్స్ నుంచి ప్రతీవారం ఎన్నో భాషలు నుంచి సినిమాలు , వెబ్ సిరీస్ లు కూడా వస్తుంటాయి.
అయితే ఇదంతా బాగానే ఉంది కానీ రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ ఒక ఊహించని స్టెప్ తీసుకుంది. తమతో పాటుగా ఇతర స్ట్రీమింగ్ యాప్స్ లో ఎప్పుటి నుంచో లైవ్ స్ట్రీమింగ్స్ ని అందిస్తూ వచ్చారు. నెట్ ఫ్లిక్స్ కూడా ఒక భారీ ఈవెంట్ ని సెట్ చేసి లైవ్ స్ట్రీమింగ్ కి తీసుకొచ్చింది. కాగా దీనికి కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ని చేశారు.

వరల్డ్ లో మోస్ట్ ఫేమస్ బాక్సింగ్ ఛాంపియన్ అయినటువంటి మైక్ టైసన్ కి తనలో సగం ఏజ్ ఉన్న ఓ యువ బాక్సర్ జేక్ పాల్ కి మధ్య బాక్సింగ్ కాంపిటేషన్ ని పెట్టి ఒక్కసారిగా వరల్డ్ వైడ్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించారు. యూఎస్ లో ఎంతో గ్రాండ్ గా సెట్ చేసిన ఈ ఈవెంట్ కి దాదాపు 70 వేలకి మందికి పైగా ఆ స్టేడియంలోకి హాజరవ్వగా.. ఓటిటిలో మాత్రం రికార్డుల దుమ్ము లేపింది ఈ ఈవెంట్.
కాగా నెట్ ఫ్లిక్స్ వారు లైవ్ స్ట్రీమింగ్ కి తీసుకొచ్చిన ఈ ఈవెంట్ ని ఏకంగా 60 మిలియన్ మంది స్ట్రీమింగ్ చేశారట. దీనితో నెట్ ఫ్లిక్స్ లో ఓ ఈవెంట్ కి కానీ కంటెంట్ కి కానీ అతి తక్కువ సమయంలో హైయెస్ట్ రికార్డు ఇదేనని తెలుస్తుంది. మరి దీనికి కారణం లెజెండ్ మైక్ టైసన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . 58 ఏళ్ళు వయసులో కూడా తన స్పీడ్, పంచెస్ ని చూద్దాం అని అది కూడా ఓ యంగ్ బాక్సర్ తో యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనే అంశాలు కూడా ఓటిటి ఆడియెన్స్ ని ఇది చూసేందుకు దోహదపడింది.
అలా ఓటిటిలో ఈ ఈవెంట్ భారీ రెస్పాన్స్ ని కొల్లగొట్టింది. కాగా ఇదే ఈవెంట్ లో ఓ ఇద్దరు మహిళా బాక్సర్ల మ్యాచ్ కి మాత్రం 50 మిలియన్ల మంది స్ట్రీమింగ్ చేశారట. ఇలా మొత్తానికి అయితే ఓటిటిలలో నెట్ ఫ్లిక్స్ ఒక కొత్త హిస్టరీ సెట్ చేసింది అని చెప్పాలి. ఇక ఇవి పక్కన పెడితే మైక్ టైసన్ మొట్ట మొదటిసారిగా ఓ తెలుగు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
యువ హీరో విజయ్ దేవరకొండ అలాగే పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా "లైగర్" లో మైక్ గెస్ట్ రోల్ ని చేశారు. మరి ఈ సినిమాలో కూడా తనకంటే యంగ్ బాక్సర్ అయినటువంటి విజయ్ దేవరకొండ చేతిలో ఓడిపోవడం విశేషం. కాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఆ మ్యాచ్ కి లైగర్ చిత్ర యూనిట్ మైక్ కి తమ బెస్ట్ విషెస్ ని కూడా అందజేసింది.


Click it and Unblock the Notifications











