OTT: దుమ్ము రేపుతున్న బోల్డ్ వెబ్ సిరీస్.. ఇండియన్ ఓటిటిలోనే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్1
ప్రస్తుతం ఇండియన్ ఓటిటి దగ్గర సాలిడ్ కంటెంట్ ని ఆల్ మోస్ట్ అన్ని పాపులర్ స్ట్రీమింగ్ సంస్థలు తీసుకొచ్చి సంగతులు ఆడియెన్ కి అందించి ఎంగేజ్ చేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. అలా ఇండియా లో ఉన్న టాప్ సంస్థలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇంకా హాట్ స్టార్ లాంటి దిగ్గజ సంస్థలు క్రేజీ సిరీస్ లు సినిమాలు తమ వీక్షకుల కోసం తీసుకొస్తున్నాయి కానీ ఇండియాలో మాత్రం భారీ రెస్పాన్స్ ఉన్న అన్ని ఓటిటి సిరీస్ లు దాదాపు ఒక్క అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రమే ఉన్నాయని చెప్పవచ్చు.
కాగా ఇండియా నుంచి బెస్ట్ కంటెంట్ ని ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోవడంలో ముందుంటున్నారు. అలాగే అందులో సెన్సేషనల్ హిట్ అయ్యిన సిరీస్ లు చూస్తే ది ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్, ఇంకా పాతాళ లోక్, పంచాయత్ వంటి సిరీస్ లు కనిపిస్తాయి. ఇక మాస్ ఆడియెన్స్ లో అయితే మిర్జాపూర్ అనే సిరీస్ కి క్రేజీ ఫాలోయింగ్ ఉంది. మెయిన్ గా సీజన్ 1 తో పాన్ ఇండియా వైడ్ గా భారీ ఫాలోయింగ్ దీనికి సొంతం కాగా ఇప్పుడు సీజన్ 3 వరకు వచ్చింది.

కాగా ఇప్పుడు సీజన్ 3 కి కూడా భారీ హైప్ నెలకొనగా ఇదే హైప్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ కి మాత్రం అనుకున్న రేంజ్ పాజిటివ్ టాక్ రాలేదు. కానీ ఉన్న హైప్ లో మాత్రం ప్రైమ్ వీడియోలో ఊహించని రెస్పాన్స్ ని ఈ సిరీస్ అందుకుంది. కాగా జస్ట్ వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రైమ్ వీడియోలో ఆల్ టైం రికార్డు వ్యూస్ అన్నిటిని మిర్జాపూర్ 3 దాటేసిందట.
అలా దాటి ఇప్పుడు సిరీస్ ఇండియా లోనే అత్యధిక వ్యూస్ అందుకున్న సిరీస్ గా నిలిచింది. కాగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మిర్జాపూర్ 3 కి గాను కేవలం ఈ కొన్ని రోజుల్లోనే ఏకంగా 11.7 మిలియన్ వ్యూస్ నమోదు అయ్యాయట. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ రికార్డు కాగా దీని తర్వాత రెండో స్థానంలో కూడా మిర్జాపూర్ కే చోటు దక్కినట్టుగా తెలుస్తుంది. ఈసారి సీజన్ 2 మొత్తం 3.6 మిలియన్ వ్యూస్ ని అందుకుందట.

ఇక వీటి తర్వాత పంచాయత్, ఫర్జి అలాగే ఇండియన్ పోలీస్ ఫోర్స్ లాంటి సిరీస్ లు నిలిచాయి. అయితే టాక్ బాగాలేకపోయినా కూడా సీజన్ 4 కి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది అంటే అసలు మిర్జాపూర్ ఫ్రాంచైజ్ కి ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాగా ఈ సిరీస్ లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వెర్మ, గుండె జారి గల్లంతయ్యిందే నటి ఇషా తల్వార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ప్రస్తుతం ఈ సిరీస్ ఓటిటిలో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











