Mirzapur 3 First Look: మీర్జాపూర్ 3 రిలీజ్‌పై అమెజాన్ సస్పెన్స్ .. ఫస్ట్ లుక్‌తో అంచనాలు పెంచేసిన టీమ్

ముంబైలో అమెజాన్ ప్రైమ్ వీడియో అతిపెద్ద సదస్సు ఘనంగా ముగిసింది. ఈ వేడుకలో దాదాపు 70కిపైగా వెబ్ సిరీస్, సినిమాలను ప్రకటించారు. త్వరలోనే అమెజాన్ ఓటీటీలో వివిధ భాషల్లో భారీగా సీరీస్, మూవీలు రిలీజ్ చేస్తున్నట్టు అట్టహాసంగా ప్రకటించారు. అందులో మీర్జాపూర్ 2 సిరీస్ ఒకటి. ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్‌లో ఒకటిగా నిలిచిన మీర్జాపూర్ 3 సిరీస్‌పై క్లారిటీ వచ్చేసింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ సిరీస్ 3 సీజన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ సిరీస్ గురించిన వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో సంచలనం రేపడమే కాకుండా అత్యధిక మందిని ఆకట్టుకొన్న మీర్జాపూర్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫైజల్, దివ్యేందు శర్మ, శ్వేతా త్రిపాఠి తదితరులు నటించారు. ఈ సీరీస్ 2వ సీజన్ కోసం ప్రేక్షకులు 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇక అమెజాన్ సదస్సులో దాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.

Mirzapur 3 Web Series First look Released at Amazon Prime Video mega Event in Mumbai

మీర్జాపూర్‌పై అధిపత్యం సాధించడానికి కలీన్ భయ్యాను మట్టుపెట్టేందుకు గుడ్డు భయ్యా, గోలు ప్రయత్నించడం.. ఆ క్రమంలో వారి మధ్య జరిగిన ఫ్యాక్షన్ విషయాలు, అత్యధికంగా ట్విస్టుల, సర్‌ప్రైజ్‌లతో సాగింది. ఇక 2వ సీజన్‌లో చివరకు మీర్జాపూర్‌ను గుడ్డు భయ్యా వంశం చేసుకోవడం, గోలు అతడికి కుడిభుజంగా మారడం ఆసక్తికరంగా ఉంటుంది. మున్నా భయ్యా క్యారెక్టర్ గురించి అంతు చిక్కని ప్రశ్నలు మిగిలి ఉండటంతో మీర్జాపూర్ 3 ఎప్పుడెప్పుడు చూద్దామా? ప్రశ్న అందరిలో నెలకొన్నది.

Mirzapur 3 Web Series First look Released at Amazon Prime Video mega Event in Mumbai

అమెజాన్ ప్రైమ్ వీడియో ముంబై మెగా ఈవెంట్‌లో వేదికపైన మీర్జాపూర్ టీమ్ మెరిసింది. ఈ సీరీస్‌లో నటించిన వారందరూ వేదికపైన కనిపించి అభిమానులను ఆకట్టుకొన్నారు. ఈ సందర్బంగా మీర్జాపూర్ 3 ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా.. మరింత ఆసక్తిని, అంచనాలను పెంచింది.

Mirzapur 3 Web Series First look Released at Amazon Prime Video mega Event in Mumbai

అయితే మీర్జాపూర్ 3 సీజన్ రిలీజ్ ఎప్పుడనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. స్ట్రీమింగ్ డేట్‌ను సస్పెన్స్‌లో పెట్టి ఆసక్తిని, ఎదురుచూపులను రెట్టింపు చేసింది. మంటల్లో తగలపడిపోతున్న కుర్చీని ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేసింది. దాని పక్కనే శవాలు పడి ఉన్నాయి. దాంతో ఈ సీరిస్‌లో ఇంకా ఫ్యాక్షన్ బాగానే ఉంది. హింస తదితరల అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే అవకాశం ఉందనే ఫీలింగ్ ఫస్ట్ లుక్‌ చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X