సినిమాగా బోల్డ్ అండ్ వైలెంట్ వెబ్ సిరీస్.. మీర్జాపూర్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
గడిచిన ఈ కొన్నేళ్లలోనే ఓటిటిలు ఎంతలా పాపులర్ అయ్యాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా వరల్డ్ వైడ్ గా అనేక స్ట్రీమింగ్ యాప్స్ ఉండగా ఈ యాప్స్ లో ఎన్నో వెబ్ సిరీస్ లు ఒరిజినల్ సినిమాలు కూడా ఉన్నాయి. కాగా వరల్డ్ వైడ్ గా మంచి పాపులర్ అయినటువంటి స్ట్రీమింగ్ యాప్స్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోకి మన దేశంలో కూడా సబ్ స్క్రైబర్స్ ఎక్కువే..
ఇలా ఇండియాలో కూడా ప్రైమ్ వీడియోకి మంచి ఆదరణ లభించగా ఇందులో పలు భారీ హిట్ వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. కాగా అలా ఓ రేంజ్ లో హిట్ అయ్యిన వెబ్ సిరీస్ లవ్ మోస్ట్ వైలెంట్ అండ్ వెరీ బోల్డ్ వెబ్ సిరీస్ "మీర్జాపూర్" కూడా ఒకటి. కాగా ఈ వెబ్ సిరీస్ హిందీ సహా ఇతర భాషల్లో ఎప్పుడైతే డబ్బింగ్ అయ్యిందో అక్కడ నుంచే సెన్సేషనల్ రీచ్ ని అందుకుంది.

కాగా ఇక్కడ నుంచి మొత్తం మూడు సీజన్లని ప్రైమ్ వీడియో వారు అందించారు. సీజన్ 3 కూడా కొన్ని నెలలు కితమే వచ్చింది. అయితే సీజన్ 1 పెద్ద హిట్ కావడంతో సీజన్ 2 పై మామూలు అంచనాలు నెలకొనలేదు. అంతెందుకు దీనిపై ఉన్న క్రేజ్ చూసి ఆ సిరీస్ నటీనటులు తెలుగులో కూడా ప్రమోషన్స్ చేశారు. ఇలా ఆడియెన్స్ లో అయితే ఓటిటిలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ కి ఒక స్పెషల్ లీగ్ ఫ్యాన్స్ ఉన్నారు.
ఐతే సీజన్ 3 మాత్రం అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేదు అని కంప్లైంట్స్ వచ్చాయి. పైగా మున్నా భయ్యా నటుడు దివ్యెందు కూడా సిరీస్ లో లేకపోవడం మేకర్స్ కి భారీ మైనస్ అయ్యింది. అయినప్పటికీ ఏదొకలా లాక్కొచ్చారు కానీ ఇప్పుడు దీనికి మించిన ప్లాన్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అనౌన్స్ చేశారు. కాగా ఇప్పుడు మీర్జాపూర్ కి సీజన్ 4 తో పాటుగా అదనంగా సినిమాని కూడా తీసుకొస్తున్నారట.
ఇది మాత్రం ఊహించని బిగ్ న్యూస్ అని చెప్పాలి. కాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సహా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి కలిపి ఈ సినిమాని అదే మీర్జాపూర్ నటీనటులతో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాగా పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ అలాగే సిరీస్ ఫేమస్ నటుడు దివ్యెందు శర్మలపై ఓ అనౌన్సమెంట్ టీజర్ ని కూడా మేకర్స్ విడుదల చేసి మీర్జాపూర్ సినిమా వెర్షన్ ని అనౌన్స్ చేశారు.

కాగా ఇది చూసిన ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు కానీ ఇది థియేటర్స్ లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఈ సిరీస్ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణమే అందులోని మాస్ డైలాగులు నాచురల్ గా సాగే బ్లడ్ డ్రామా ఇంకా కొన్ని అడల్ట్ సీన్స్ కూడా వీటితోనే దీనికి పెద్ద రచ్చే నడిచి పాపులర్ అయ్యింది. అప్పుడు అంటే ఓటిటికి పెద్దగా సెన్సార్ లు లేవు కాబట్టి ఏం చూపించినా ఏం చేసినా నడిచింది.
కానీ బిగ్ స్క్రీన్ పై సినిమా అంటే అలానే ఉంటే కుదరదు పోనీ ఏ లేదా ఆర్ రేటింగ్ తెచ్చుకుని స్ట్రిక్ట్ గా తీసుకొస్తే తప్ప థియేటర్స్ లో ఈ సినిమా వర్క్ అయ్యే ఛాన్స్ లేదు. మరి థియేటర్స్ పరంగా ఈ బోల్డ్ అండ్ అడల్ట్ సినిమా ఎంతమేర క్లిక్ అవుతుంది అనేది వేచి చూడాలి. అన్నట్టు మీర్జాపూర్ సినిమాని మేకర్స్ 2026లో తీసుకొస్తారని ప్రకటించారు అలాగే ఈ సినిమాని వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన దర్శకుడే గురుమీత్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











