Miss Shetty Mr Polishetty: ఓటీటీలోకి క్రేజీ మూవీ.. ఆ డైలాగులు, సీన్స్ కూడా!
తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న యంగ్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే, అందులో అతి తక్కువ మంది మాత్రమే తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. తద్వారా ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకుంటున్నారు. అందులో నవీన్ పోలిశెట్టి ఒకడు. ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటిన ఈ యంగ్ హీరో.. ఇటీవలే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.
మహేశ్ బాబు పీ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రమే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఈ చిత్రం ఆరంభంలోనే అదిరిపోయే టాక్‌ను సొంతం చేసుకుంది. అందుకు అనుగుణంగానే ప్రేక్షకుల రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని మంచి ఓపెనింగ్స్‌ను అందుకుంది. ఆ తర్వాత కూడా అదే ఊపును కంటిన్యూ చేస్తూ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకుంది. అలా దాదాపు మూడు వారాల పాటు థియేటర్లలో సందడి చేసి లాభాలను కూడా భారీగానే దక్కించుకుంది.

అనుష్క శెట్టి - నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‌లో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ భారీగా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసింది.
బిజినెస్ డీల్ జరుపుకున్న సమయంలోనే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీని థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అంటే సెప్టెంబర్ 7న విడుదలైన ఈ మూవీ అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ప్రకటన వచ్చేసింది.

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ఓటీటీ డేట్‌పై ఎన్నో ప్రచారాలు జరుగుతోన్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వదిలింది. ఇందులో ఈ చిత్రాన్ని అక్టోబర్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. అంటే కరెక్టుగా 4 వారాల తర్వాతనే దీన్ని తీసుకు వస్తున్నారు. ఇక, ఇందులో సెన్సార్ కాని వెర్షన్‌ను అందుబాటులో ఉంచుతారని అంటున్నారు. అంటే కట్ చేసిన సీన్స్, మ్యూట్ చేసిన డైలాగ్‌లను కూడా చూపించబోతున్నారు.
ఇదిలా ఉండగా.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











