Miss Shetty Mr Polishetty: ఓటీటీలోకి వచ్చేసిన ఫన్ మూవీ.. థియేటర్ కంటెంట్ కాకుండా!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో విభిన్నమైన కంటెంట్‌లతో సినిమాలు వస్తున్నాయి. వాటిలో చాలా చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సక్సెస్‌లు సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి ఓ మూవీనే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఈ చిత్రం యూత్‌ఫుల్ కాన్సెప్టుతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నవీన్ పోలిశెట్టి - అనుష్క శెట్టి జంటగా మహేశ్ బాబు పీ తెరకెక్కించిన చిత్రమే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకుల రెస్పాన్స్‌ను భారీగా అందుకుంది. ఆ తర్వాత కూడా అదే ఊపును కంటిన్యూ చేస్తూ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరింది. అలా దాదాపు మూడు వారాల పాటు థియేటర్లలో సందడి చేసింది.

యూత్‌కు కనెక్ట్ అయ్యే కామెడీతో తెరకెక్కిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ భారీగా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసినట్లు ఫిలిం నగర్ సమాచారం.
ఓటీటీకి సంబంధించిన బిజినెస్ డీల్ జరుపుకున్నప్పుడే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీని థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. అంటే సెప్టెంబర్ 7న విడుదలైన ఈ మూవీ అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఇది అందుబాటులోకి వచ్చింది.

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ అక్టోబర్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా తెలిపింది. ఇందులో భాగంగానే దీన్ని నేటి అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చింది. ఇక, ఇందులో థియేటర్ల వెర్షన్ కాకుండా నాన్ ఎడిటెడ్ కంటెంట్‌ను చూపిస్తున్నారట. అంటే సెన్సార్ లేని సినిమాను చూపిస్తున్నారు.
ఇక, క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇందులో జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు కీలక పాత్రల్లో కనిపించారు.


Click it and Unblock the Notifications











