OTT:మూవీ లవర్స్ గెట్ రెడీ... రేపు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!

ఓటీటీ వచ్చాక మూవీ లవర్స్.. ఆ కంటెంట్ కు బాగా అలవాటు పడిపోయారు. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ప్రేక్షకులు ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు. ఇక ఓటీటీ వేదికలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొత్త కొత్త సినిమాలు తీసుకువస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుండగా... రేపు ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆ వివరాల్లోకి వెళితే....

వీకెండ్ వస్తుందంటే చాలు... థియేటర్లలో కొత్త సినిమాలతో పాటు.. ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతాయి. ఇక రేపు అనగా సెప్టెబర్ 5న 5 కొత్త సినిమాలు, సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. ఇక వీటిలో అందరి దృష్టిని రెండు సినిమాలు ఆకర్షిస్తున్నాయి. అందులో ఒకటి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కాగా... మరోది ఖుఫియ అనే హింది సినిమా. ఇక ఈ సినిమాలు రేపు ఓటీటీలోకి రాబోతున్నాయి.

Miss Shetty Mr Polishetty to Khufiya Movies and Web Series List on Oct 5th 2023

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు మహేశ్ బాబు పచ్చిగొళ్ల దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించింది. ఈ సినిమాకు రధన్ సంగీతం అందించారు. సినిమాలో మ్యూజిక్ ఆకట్టుకుంది.

ఇక విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మంచి టాక్ లభించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి సినిమా లాభాలు గడించింది. ఇక ఈ మూవీ నెల కాకముందే ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. రేపు అనగా అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ నుంచి తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక మరోవైపు టబు నటించిన ఖుఫియా చిత్రం కూడా అందరి దృష్టి ఆకర్షిస్తుంది. ఈ సినిమా హిందీ మూవీ అయినప్పటికీ... స్పై పాత్రలో టటు ఈ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాల్లో టబు ఇరగదీసింది. ఈ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ వేదికగా డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కానుంది.

Miss Shetty Mr Polishetty to Khufiya Movies and Web Series List on Oct 5th 2023

రేపు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల వివరాలు...

1. మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి (తెలుగు) అక్టోబరు 5న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
2. ఎవ్రీథింగ్‌ నౌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 5న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
3. ఖుఫియా (హిందీ) అక్టోబరు 5న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
4. లుపిన్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 5న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
5. గ్రాన్‌ టురిస్‌మో (హాలీవుడ్‌) అక్టోబరు 5న బుక్‌ మై షోలో స్ట్రీమింగ్

మొత్తంగా రేపు ఓటీటీలో నవీన్ పోలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో పాటు.. టబు నటించిన యాక్షన్ సినిమా ఖుఫియా రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మీరు గనుక ఈ సినిమాలు చూడకపోతే.. రేపు ఎంచాక్క ఇంట్లోనే ఓసారి చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X