థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో దుమ్మురేపుతూ.. కాంతార పోటీగా మిత్ర మండలి

బన్నీ వాసు (BV) సమర్పకుడిగా బీవీ వర్క్స్ బ్యానర్‌పై సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం మిత్ర మండలి. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌తో మంచి క్రేజ్ లభించింది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేశారు.

మిత్ర మండలి కథ విషయానికి వస్తే..జగ్లీ అనే పట్టణంలోని నలుగురు మిత్రుల మధ్య సరదాగా సాగిపోయే వినోదాత్మక చిత్రం. చైతన్య (ప్రియదర్శి), సాత్విక్ (విష్ణు), అభి (రాగ్ మయూర్), రాజీవ్ (ప్రసాద్ బెహరా) నలుగురు స్నేహితులు. బాధ్యత లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటారు. అదే గ్రామంలో తుట్టె కులానికి చెందిన నారాయణ (వీటీవీ గణేష్) కూతురు స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎమ్)‌ను ప్రేమిస్తుంటారు. అయితే స్వేచ్ఛ మాత్రం చైతన్యను ప్రేమిస్తుంటుంది. ఈ క్రమంలో కూతురు స్వేచ్చ కిడ్నాప్ గురైందని తెలుస్తుంది. ఒకే అమ్మాయిని నలుగురు ఇష్టపడితే ఏం జరిగింది అనేది కథ.

Mithra Mandali trending in Amazon Prime Video Comedy movie fight with Kantara Chapter 1 in OTT

థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కంటెంట్ పూర్తిస్థాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయిందనే టాక్ బలంగా వినిపించింది. రిలీజ్‌కు ముందు జాతిరత్నాలు రేంజ్‌లో విజయాన్ని ఊహించారు. కానీ ఈ సినిమా అంతగా బాక్సాఫీస్ వద్ద కాసుల చప్పుడు పెద్దగా వినిపించలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమాను సుమారుగా 15 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే థియేట్రికల్ రన్‌లో మాత్రం ఏపీ, తెలంగాణలో ఈ సినిమా 2 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకొని ఈ చిత్రం ఇటీవల ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమా హక్కులను భారీ మొత్తాన్ని చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకొన్నది. అయితే ఈ సినిమా ఓటీటీలో అనూహ్యమైన ఫలితాన్ని రాబడుతున్నది. దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ లో టాప్ #2 ట్రెండింగ్ లో నిలిచింది. ప్రస్తుతం టాప్ #1 ట్రెండింగ్ లో ఉన్న కాంతార చిత్రానికి పోటీగా నిలుస్తూ మరింత వేగంగా ప్రేక్షకులను అలరిస్తూ మిత్ర మండలి దూసుకు వెళ్తోంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను ఓటీటీ ఆడియెన్స్ బాగా ఆదరించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.

యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ చేసే కంటెంట్. సన్నివేశాలను సహజంగా గా చూపిస్తూ, వారి మధ్య జరిగే సన్నివేశాలను, సందర్భాలను పూర్తి స్థాయిలో వినోదభరితంగా చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో వినోదపరిచింది. మంచి విజువల్స్ తో అద్భుతమైన నిర్మాణ విలువలతో పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా మిత్రమండలి చిత్రం అన్ని జోనర్ల ప్రేక్షకులను అలరిస్తుంది. దర్శకుడు విజయేందర్ సరికొత్త శైలిలో మిత్రమండలి చిత్రాన్ని తెరకెక్కించగా నటీనటుల నటన, సంగీతం అన్నీ కలిసి సినిమాకు మరింత ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బహుశా ఇదే ట్రెండింగ్ లో ఇంతటి ర్యాంకింగ్ సాధించటానికి కారణం చిత్ర నిర్మాతలు అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X