Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Mitra Sharma సివంగి రేంజ్ ఆట.. టాప్ 5లో కన్ఫర్మ్.. తండ్రి ఫోటోను చూసి భోరున విలపించిన మిత్రాశర్మ
బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లేది ఎవరైనా ఉన్నారంటే... అది మిత్రా శర్మ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. టాలీవుడ్లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకోవాలని ప్లాన్ చేస్తున్న మిత్రా శర్మ బిగ్ బాస్ రియాలిటీ షోలో మెరిసింది. అయితే గత నామినేషన్ల ప్రక్రియ నుంచి హోస్ట్ నాగార్జున నిర్వహించే వీకెండ్ షో వరకు ఆమె ఫైర్ బ్రాండ్‌గా నిలిచింది. అయితే నాగార్జున వేదిక మీద పంపించిన ఫోటో చూసి మిత్రా శర్మ ఎమోషనల్ కంటతడి పెట్టుకొన్నారు. అయితే ఆ ఫోటో వెనుక కథ ఏమిటంటే...
బిందు మాధవి వర్సెస్ మిత్రాశర్మ
గతవారం నామినేషన్ల ప్రక్రియ విషయంలో తనను టార్గెట్ చేసిన బిందు మాధవి చేసిన వ్యాఖ్యలను మిత్రా శర్మ తప్పుపట్టింది. అయితే టాస్క్ ఆడుతున్న సమయంలో తనకు వెన్నునొప్పి ఉందని చెబితే.. దానిని తప్పుడు విధంగా చెబుతూ మిత్రా శర్మ వెన్నుముకకు సర్జరీ, ఆపరేషన్ చేసిన ఆరోపణలను నాగార్జున తప్పుపట్టారు. బిందుమాధవి టార్గెట్ చేయడాన్ని మిత్ర బలంగా తిప్పి కొట్టింది.
మిత్రా శర్మ కోసం ఫోటో
మిత్రా శర్మను ఉద్దేశించి బిందు మాధవి చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎదైనా ఏమైనా విషయం చెబితే.. వాటిని ఊహించుకోవద్దు అని నాగార్జున సలహా ఇంటి సభ్యులకు ఇచ్చారు. అయితే వేదికపైకి కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను పిలిచి ఫన్ గేమ్ ఆడించారు. అయితే చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొన్న మిత్రాశర్మకు తన తండ్రి ఫోటోను పంపించడంతో మిత్రా శర్మ ఎమోషనల్ అయ్యారు.
తండ్రి ఫోటోను చూసి కంటతడి
నాగార్జున పంపిన తన తండ్రి ఫోటోను చూసి మిత్రాశర్మ భోరున విలపించింది. ఇంటిలోకి అందరి కుటుంబ సభ్యులు వస్తుంటే.. నా ఫ్యామిలీ మెంబర్స్ రాకపోవడంపై ఆవేదన చెందారు. నాకు నా అనే వాళ్లు లేరు అని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఇలాంటి భావోద్వేగమైన క్షణాల్లో మిత్రాశర్మకు ఇష్టమైన సిరి హన్మంతు, గంగాధర్‌ను పరిచయం చేశారు. వారిని చూడగానే మిత్రాశర్మ ఎమోషనల్ అయ్యారు.
అన్నయ్య లాంటి వారు
తనను చూడటానికి వచ్చిన గంగాధర్ గురించి మాట్లాడుతూ మిత్రాశర్మ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు. నాకు అన్నయ్య లాంటి వారు అని ఆనందాన్ని వ్యక్తం చేసింది. వారిద్దరని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని మిత్రాశర్మ చెప్పారు.
సివంగి మాదిరిగా చెలరేగిన మిత్ర
మిత్రాశర్మ
గురించి
గంగాధర్
మాట్లాడుతూ..
ఆమె
సివంగి.
అలానే
ఇంటిలో
ఆడుతున్నది.
బయట
ఎలా
ఉంటుందో..
ఇంటిలో
కూడా
అలానే
ఉంది.
షోలో
బాగా
ఆడుతున్నది
అని
గంగాధర్
చెప్పారు.
ఇక
మిత్రా
గేమ్
గురించి
సిరి
హన్మంతు
కూడా
ప్రశంసలు
కురిపించిది.
టాప్
5లో
ఉండటం
ఖాయం
అని
సిరి
హన్మంతు
జోస్యం
చెప్పింది.