twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Paper Rocket.. ముఖ్యమంత్రి కూతురు డైరెక్షన్‌లో వెబ్ సిరీస్.. నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ ఆవిష్కరణ

    |

    గాలివాన, రెక్కి, మా నీళ్ల ట్యాంక్ లాంటి విభిన్నమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన జీ5 ఓటటీ పేపర్ రాకెట్ అనే వెబ్ సిరీస్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమార్తె కృతిగ ఉదయనిధి ఈ వెబ్ సిరీస్‌కు రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీనిధి సాగర్ నిర్మించారు. ఈ చిత్రం జూలై 29వ తేదీన జీ5 స్ట్రీమింగ్ కానున్నది. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ ఆవిష్కరణ వివరాల్లోకి వెళితే..

    అద్బుతమైన భావోద్వేగాలతో

    అద్బుతమైన భావోద్వేగాలతో


    పేపర్ రాకెట్ వెబ్ సిరీస్‌లో కాళిదాస్ జయరామ్, తన్యా రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మానవ విలువలు, భావోద్వేగాలు, లైఫ్ ఫిలాసఫీ అంశాలతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో అద్భుతమైన పాటలు, ఎంగేజింగ్‌గా కథ ఉందనే విషయాన్ని ట్రైలర్ స్పష్టం చేసింది.

    హృదయానికి హత్తుకొనేలా

    హృదయానికి హత్తుకొనేలా


    పేపర్ రాకెట్ ట్రైలర్ రిలీజ్ తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. హృదయానికి హత్తుకొనేలా ట్రైలర్ ఉంది. ఎన్నో ఎమోషన్స్‌ చక్కగా పలికించారు. వెబ్ సిరీస్‌ను ఎంజాయ్ చేస్తూ రూపొందించారనే విషయం స్పష్టమైంది అని అన్నారు.

    నా హృదయానికి చేరువైన కథ

    నా హృదయానికి చేరువైన కథ


    దర్శకురాలు కృతిగ ఉదయనిధి మాట్లాడుతూ.. పేపర్ రాకెట్ నా హృదయానికి చేరువైన కథ. సినిమా ఇండస్ట్రీలోని పెద్దలందరి పేరు ఈ సీరిస్‌తో ముడిపడి ఉంది. పేపర్ రాకెట్‌పై నమ్మకం ఉంచిన జీ5 ఓటీటీ సంస్థకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను. స్క్రిప్టు, సాంకేతిక నిపుణుల పనితీరు, నటీనటులు పెర్ఫార్మెన్స్ ఈ వెబ్ సిరీస్‌కు బలంగా మారాయి. తపస్ నాయక్ అందించిన సౌండ్ డిజైన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని అన్నారు.

    పేపర్ రాకెట్ అవుట్‌పుట్‌పై

    పేపర్ రాకెట్ అవుట్‌పుట్‌పై


    నిర్మాత శ్రీనిధి సాగర్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టును అంకితభావంతో త్వరగా పూర్తి చేసిన యూనిట్‌కు ధన్యవాదాలు. పేపర్ రాకెట్ వెబ్ సిరీస్ అవుట్‌పుట్‌తో నేను పూర్తిగా సంతృప్తి చెందాను. అందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ అని అన్నారు.

    పేపర్ రాకెట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    పేపర్ రాకెట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు


    నటీనటులు: కాళిదాస్ జయరాం, తన్యా ఎస్ రవిచంద్రన్, కే రేణుక, కరుణాకరన్, నిర్మల్ పలాజీ, గౌరీ జీ కిషన్, ధీరజ్, నాగినీడు, చిన్ని జయంత్, కాలి వెంకట్, పూర్ణిమ భాగ్యరాజ్, జీఎం కుమార్, అభిషేక్ శంకర్, ప్రియదర్శిని రాజ్‌కుమార్, సుజాత తదితరులు
    నిర్మాత: శ్రీనిధి సాగర్
    బ్యానర్: రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్స్
    రచన, స్క్రీన్ ప్లే, డైరెక్టర్: కృతిగ ఉదయనిధి
    మ్యూజిక్: సైమన్ కే కింగ్
    ఎడిటర్: లారెన్స్ కిషోర్
    సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ఎం నాథన్, గావెమిక్ యూ ఆరీ
    ఓటీటీ రిలీజ్: 2022-07-29

    English summary
    Paper Rocket is another latest offering from the streaming giant. A feel-good series, it tells a heart-warming tale and is directed by Kiruthiga Udhayanidhi, who is the daughter-in-law of Tamil Nadu Chief Minister MK Stalin. Produced by Sreenidhi Sagar of Rise East Production, the series is all set to premiere on ZEE5 from July 29 onwards
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X