సైలెంటుగా OTTలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. అనేక ట్విస్టులున్న దీన్ని ఎలా చూడాలంటే?

ఈవారం.. ముఖ్యంగా ఈరోజే అనేక క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజై ఓటీటీ ప్రియులను తెగ అలరిస్తున్నాయి. ముఖ్యంగా అదిరిపోయే క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. అందులో ఓ క్రేజీ మూవీయే ఆరంభం. అద్భుతమైన టైమ్ ట్రావెలర్ గా రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది వంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కేరాఫ్ కంచరపాలెం సినిమాలో హీరోగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసిన మోహన్ భగత్ హీరోగా చేసిన రీసెంట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీయే ఆరంభం. అద్భుతమైన టైం ట్రావెల్ కాన్సెప్టుతో మరింతగా అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ అజయ్ నాగ్ వీ. సినిమా ప్రకటించినప్పటి నుంచి విశేష స్పందన రాబట్టుకున్న ఈ చిత్రం.. అందరినీ ఆకట్టుకుంది. ఇలా మొదటి నుంచి విపరీతమైన అంచాలను నమోదు చేసుకున్న ఈ క్రేజీ మూవీ మార్చి 10వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది.

Mohan Bhagat Recent Best Science Fiction Movie Aarambham Movie OTT Streaming Details Here

మోహన్ భగత్ సరసన ఈ సినిమాలో సుప్రిత సత్యనారాయణ హీరోయిన్ గా నటించగా.. భూషణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాలా, బొడ్డెపల్లి అభిషేక్, సురభి ప్రభావతిలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అభిషేక్ వీటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే ఈ సినిమాకు సింజిత్ ఎర్రమల్లి సంగీతాన్ని అందించారు. ఆదిత్య తివారి, ప్రతీమ్ గాయత్రిలు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. దేవ్ దీప్ గాంధీ కుండు ఈ సినిమాకు డీఓపీగా వ్యవహరించారు. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబట్టుకోవడంలో విఫలం అయింది.

థియేటర్లలో ఎక్కువ కాలం ఆడలేకపోయిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. సైలెంట్ గా వచ్చి ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్‌ సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. వీటి కోసం మంచి మొత్తాన్నే నిర్మాతలకు కూడా ముట్టజెప్పింది. ఇక, విడుదలైన కొద్ది రోజులకే ఈ సినిమా స్ట్రీమింగ్‌పై తాజాగా ఓ ఊహించని ప్రకటన వచ్చింది.

విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ ఆరంభం సినిమా ఈరోజు నుంచి అంటే మే 23వ తేదీ నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా థియేటర్లలోకి వచ్చిన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన అందరికీ షాక్ ఇచ్చింది. అయితే థియటర్లలో ఈ సినిమాను చూడలేకపోయినా వారంతా ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ క్రేజీ మూవీని మీరు కూడా ఓటీటీ వేదికగా చూసేయండి. ఇంకా ఎందుకు ఆలస్యం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X